Abn logo
Sep 23 2021 @ 23:58PM

పోలీస్‌స్టేషన్‌లో రెడ్డి సుబ్రహ్మణ్యం బైఠాయింపు

పోలీస్‌స్టేషన్‌లో రెడ్డి సుబ్రహ్మణ్యం బైఠాయింపు

కె.గంగవరం, సెప్టెంబరు 23: పామర్రు పోలీసుల వైఖరిని నిరసిస్తూ టీడీపీ రామచంద్రపురం నియోజకవర్గ ఇన్‌చార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం బుధవారం పోలీస్‌స్టేషన్‌లో బైఠాయించారు. ఈ నెల 21న టీడీపీ ఎంపీటీసీగా గెలుపొందిన కడలి సత్యసూర్యకుమారిని అభినందించడానికి ఆయన యండగండి గ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా కార్యకర్తలు బాణసంచా కాల్చారు. దీనిపై వైసీపీ నాయకులు 9 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ కె.చిరంజీవి రెండు రోజులుగా వారిని పోలీస్‌స్టేషన్‌ చుట్టూ తిప్పుతున్నారు. దీనిపై ప్రశ్నించేందుకు బుధవారం రాత్రి స్టేషన్‌కు వచ్చారు. అయితే అక్కడ ఎస్‌ఐ కనీస మర్యాద ఇవ్వకపోవడతో స్టేషన్‌లో నేలపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు వైసీపీకి కొమ్ముకాస్తున్నారని, చిన్న కేసు విషయంలో కూడా కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రామచంద్రపురం సీఐ వి.శ్రీనివాస్‌ ఫోన్‌లో రెడ్డి సుబ్రహ్మణ్యంతో చర్చించారు. సీఐ హామీ మేరకు ఆయన నిరసన విరమించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రవికుమార్‌, సలాది రమేష్‌, టీడీపీ మండల అధ్యక్షుడు చొల్లంగి వెదుర్లయ్య పాల్గొన్నారు.