రెడ్డికాలనీ అభివృద్ధి బాధ్యత నాది

ABN , First Publish Date - 2022-05-22T05:03:01+05:30 IST

రెడ్డికాలనీ అభివృద్ధి బాధ్యత తనదని టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ హామీ ఇచ్చారు.

రెడ్డికాలనీ అభివృద్ధి బాధ్యత నాది

మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

సంగారెడ్డి రూరల్‌, మే 21: రెడ్డికాలనీ అభివృద్ధి బాధ్యత తనదని టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ హామీ ఇచ్చారు. ‘ఆంధ్రజ్యోతి’లో ఈనెల 21న ‘మురుగు కంపు భరించలేకున్నాం’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు, ప్రజాప్రతినిఽధులు ఎట్టకేలకు స్పందించారు. సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో గల రెడ్డికాలనీలో శనివారం చింతా ప్రభాకర్‌ పర్యటించారు.

పార్టీలకు అతీతంగా అభివృద్ధి

సంగారెడ్డి టౌన్‌, మే 21: పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయాలన్నదే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతాప్రభాకర్‌ అన్నారు. బస్తీబాటలో భాగంగా శనివారం  మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, వైస్‌ చైర్‌పర్సన్‌ లతావిజయేందర్‌రెడ్డితో కలిసి సంగారెడ్డిలోని 11, 12, 30, 36 వార్డులలో పర్యటించారు. ఆయా వార్డులలోని కొత్లాపూర్‌, పొతిరెడ్డిపల్లి, బృందావన్‌ కాలనీ, ఓడీఎఫ్‌ కాలనీ, లక్ష్మీ నగర్‌, ఆదర్శనగర్‌ కాలనీలలో తిరుగుతూ సమస్యలను తెలుసుకున్నారు. కొత్త కాలనీల్లో మురుగు కాల్వలు, రోడ్లు, తదితర సమస్యలు తీవ్రంగా ఉన్నాయన్నారు. సీఎం కేటాయించిన రూ.50 కోట్లలో కొత్త కాలనీలకు అధిక ప్రాధాన్యమిస్తామని తెలిపారు.

Updated Date - 2022-05-22T05:03:01+05:30 IST