Abn logo
Mar 6 2021 @ 23:29PM

నివర్‌.. కరోనా.. ఎన్నికలు.. అన్నింటా రెడ్‌క్రాస్‌!!

 స్వచ్ఛంద సేవల్లో ముందంజ


నెల్లూరు(వైద్యం), మార్చి 6 : ప్రజలకు, సమాజానికి ఎక్కడ అవసరం ఉందో అక్కడ ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సేవకులు ప్రత్యక్షమవుతారు. ప్రకృతి విలయ మైనా, వైరస్‌ విపత్తు అయినా సామాన్యులకు, అభాగ్యులకు అండగా నిలుస్తారు. ఇటీవల జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ రెడ్‌క్రాస్‌ విశిష్ట సేవలు అందించి పలువురి ప్రశంసలు అందుకుంది.  నాలుగు విడతల్లో జరిగిన ఈ ఎన్నికల్లో రెడ్‌క్రాస్‌ కమిటీ చైర్మన్‌ చంద్రశేఖర్‌రెడ్డి ఆఽధ్వర్యంలో 200 మంది జూనియర్‌ రెడ్‌క్రాస్‌ సభ్యులు పాల్గొని దివ్యాంగులు, వృద్ధులైన ఓటర్లకు చేయూతనిచ్చారు. పోలింగ్‌ బూత్‌లకు వెళ్లలే ని వారిని వీల్‌చైర్‌లో తరలించారు. కొన్ని చోట్ల చేతులపై ఎత్తుకుని వెళ్లి ఓటు హక్కును వినియోగించుకు నేలా సహకరించారు. వీరి సేవలను కలెక్టర్‌ చక్రధర్‌బాబు అభినందించారు.  


విపత్తుల్లో అండగా...

గతేడాది నివర్‌ కరోనా సమయంలో, నివర్‌ తుఫా ను సమయంలోనూ జిల్లా రెడ్‌క్రాస్‌ విశేషమైన సేవ లు అందించింది. కరోనా మహమ్మారి జిల్లాను అతలా కుతలం చేస్తున్న సమయంలో గతేడాది మార్చి 24వ తేదీ నుంచి జూన్‌ 4వ తేదీ వరకు 72 రోజులపాటు 5 పునరావాస కేంద్రాల ద్వారా 600మంది నిరాశ్రయు లకు రెండు పూటలా భోజనం ఏర్పాటు చేశారు. అలా గే గత ఏడాది జూన్‌ 3వ తేదీ నుంచి 18 రోజుల పాటు వలస కూలీలు 30వేల మందికి ఉచిత భోజనా లు ఏర్పాటు చేశారు. ఉచిత వైద్య శిబిరాల ద్వారా వైద్య సేవలు అందించారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు, ఒడిశా రాష్ట్రానికి చెందిన వలస కూలీలను ప్రత్యేక బస్సుల ద్వారా వారి స్వస్థలాలకు చేర్చారు. వీటికితోడు కరోనాపై విస్తృత అవగాహన కార్యక్రమా లతో పాటు 40వేల మాస్కులు, 2వేల సీసాల శానిటైజర్లను రెడ్‌క్రాస్‌ ఉచితంగా పంపిణీ చేసింది.  కరో నా రోగులకు అవసరమైన ప్లాస్మా థెరపీ చికిత్సలను అందించటంలో నెల్లూరు రెడ్‌క్రాస్‌ ఎంతో పాటు పడింది. వైరస్‌ సోకి మరణించిన వారి అంత్యక్రియలకు  ఉచితంగా ఎలక్ట్రికల్‌ మొబైల్‌ క్రిమియేషన్‌ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇక, నవంబరు 26న ప్రా రంభమైన నివర్‌ తుఫాన్‌ కారణంగా జిల్లాలోని లోత ట్టు ప్రాంతాల్లో నిరాశ్రయులైన 3వేల మంది బాధితు లకు ఉచితంగా భోజన ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో దేశంలోని రెడ్‌క్రాస్‌ విభాగాలకు నెల్లూరు శాఖ ఆదర్శంగా నిలుస్తోంది.


ప్రజా సేవకు ప్రాధాన్యం 

ప్రజాసేవలకు రెడ్‌క్రాస్‌ ప్రాధా న్యం ఇస్తుంది. ప్రత్యేకించి ప్రకృతి వైపరిత్యాలలో  కీలక పాత్ర పోషిస్తుంది. గతేడాది కరోనా కాలంలో అందించిన సేవలు మరువలేనివి. కరోనా బారిన పడకుండా ప్రజలలో చైతన్య కార్యక్రమాలు చేపట్టాము. నివర్‌ తుఫాన్‌ సమయంలో, పంచాయతీ ఎన్నికల్లోనూ లోనూ సేవలు కొనసాగించాం.

         - చంద్రశేఖర్‌రెడ్డి, రెడ్‌క్రాస్‌ కమిటీ చైర్మన్‌

   


ఎలక్రికల్‌ క్రిమియేషన్‌ పరికరం ద్వారా అంత్యక్రియలు


Advertisement
Advertisement
Advertisement