Advertisement
Advertisement
Abn logo
Advertisement

వరద బాధితులకు రెడ్‌క్రాస్‌ సాయం

నెల్లూరు (వైద్యం) నవంబరు 27 : వెంకటేశ్వరపురంలోని గాంధీ గిరిజన కాలనీలోని వరద బాధితులకు రెడ్‌క్రాస్‌  సాయం అందించింది. శనివారం ఆ సంస్థ ప్రతినిధులు ఇళ్లు పూర్తిగా కోల్పోయిన వారికి టార్పాలిన్‌ పట్టలు, దోమతెరలు, ఆయిల్‌ ప్యాకెట్‌, సబ్బులు, స్టీల్‌ వంట పాత్రల సెట్లు, ప్లాస్టిక్‌ బకెట్లు జోరు వానలో అందించారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్‌ కమిటీ చైర్మన్‌ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ  అకస్మాత్తుగా సంభవించిన వరదలకు నెల్లూరు లోని అనేక ప్రాంతాలు మునిగి పోయాయని  తెలిపారు. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పునరావాస కేంద్రాలకు చేరుకోవాల్సిన పరిస్ధితి వచ్చిందన్నారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ కమిటీ సభ్యులు రాజేంద్ర ప్రసాద్‌, ఎడవల్లి సురేష్‌, కన్వీనర్‌ భాస్కర్‌రెడ్డి, డాక్టర్‌ వేణు, కో కన్వీనర్‌ రవిందర్‌రెడ్డి, సురేఖ, సీనియర్‌ స్టేట్‌ కో ఆర్డినేటర్‌ వెంకట రవికుమార్‌, ఏవో రఘకుమార్‌, రామకృష్ణ, గోపి, జాకబ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement