రెడ్‌క్రాస్‌ 100 ఏళ్ల సైకిల్‌ యాత్ర

ABN , First Publish Date - 2021-03-04T05:14:35+05:30 IST

ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలో సైకిల్‌ యాత్ర చేపడుతున్నట్లు రెడ్‌క్రాస్‌ కమిటీ చైర్మన్‌ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.

రెడ్‌క్రాస్‌ 100 ఏళ్ల సైకిల్‌ యాత్ర
బ్రోచర్‌ను విడుదల చేస్తున్న రెడ్‌క్రాస్‌ సభ్యులు

రక్తదానం, కాలుష్యంపై ప్రచారం 

రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ చంద్రశేఖర్‌రెడ్డి


నెల్లూరు (వైద్యం), మార్చి 3 : ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలో సైకిల్‌ యాత్ర చేపడుతున్నట్లు రెడ్‌క్రాస్‌ కమిటీ చైర్మన్‌ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. నెల్లూరు రెడ్‌క్రాస్‌ భవనంలో బుధవారం కమిటీ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీన సైకిల్‌ యాత్ర ప్రారంభమై అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల మీదుగా ఈ నెల 25వ తేదీకి విజయవాడకు చేరుతుందన్నారు. ఈ యాత్రలో రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించటంతోపాటు గాలి కాలుష్యం, మొక్కల పెంపకంపై యువతలో చైతన్యం తీసుకువస్తామన్నారు. అనంతరం సైకిల్‌ యాత్ర బ్రోచర్‌ను విడుదల చేశారు. యాత్రలో పాల్గొనదలచిన వారు వంశీకృష్ణ 8309966242 నెంబర్‌ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ దామిశెట్టి సుధీర్‌ నాయుడు, కమిటీ సభ్యులు రవిప్రకాష్‌, గునపాటి ప్రసాద్‌రెడ్డి, బయ్యా ప్రసాద్‌, దాసరి రాజేంద్ర ప్రసాద్‌, గంధం ప్రసన్నాంజనేయులు, యడవల్లి సురేష్‌, వెంకటేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-04T05:14:35+05:30 IST