కరోనా బాధిత ఇంటికి రెడ్‌ స్టిక్కర్‌

ABN , First Publish Date - 2021-05-04T07:57:09+05:30 IST

రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం వినూత్న ప్రక్రియ చేపట్టింది.

కరోనా బాధిత ఇంటికి రెడ్‌ స్టిక్కర్‌

కనిగిరిలో 22 కరోనా కేసులు

మండలంలో సోమవారం ఒక్కరోజే 22 కేసులు 

కనిగిరి, మే 3 : రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం వినూత్న ప్రక్రియ చేపట్టింది. కరోనా బాధితుల గృహానికి రెడ్‌ స్టిక్కర్‌ అంటించడం సోమవారం నుంచి అమలు చేస్తున్నట్లు తహసీల్దార్‌ చెప్పారు. అందులో భాగంగా కనిగిరి మండలంలో బడుగులేరు, చల్లగిరిగల తదితర గ్రామాల్లో కరోనా కేసులు వచ్చిన గృహాలకు రెవెస్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది రెడ్‌ స్టిక్కర్లు అంటించారు. దీనివల్ల ప్రతి ఒక్కరూ ఆయా నివాసానికి వెళ్లకుండా, బాధితులు కూడా జాగ్రత్తలు పాటించేందుకే ఈ ప్రక్రియను అమలు చేస్తున్నట్లు తహసీల్దార్‌ చెప్పారు. మండలంలో సోమవారం 22 కేసులు నమోదైనట్లు డాక్టర్‌ నాగరాజ్యలక్ష్మి తెలిపారు.

Updated Date - 2021-05-04T07:57:09+05:30 IST