Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎర్రచందనం స్వాధీనం: ఇద్దరి అరెస్టు

కేవీపల్లె, డిసెంబరు 8:  ఎర్రచందనం తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్‌ చేసినట్లు కేవీపల్లె ఎస్‌ఐ బాలక్రిష్ణ తెలిపారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని గుండ్రేవారిపల్లె క్రాస్‌నుంచి ఎర్రచందనం తరలిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. నూతనకాల్వ వైపు నుంచి వేగంగా వస్తున్న ఓ కారును ఆపి చూడగా వాహనంలోని వెనుకసీట్ల కింద పది ఎర్రచందనం దుంగలు ఉండడటం గుర్తించారు. వాహనంలో వున్న కావలిపల్లెకు చెందిన శ్రీనివాసులు, మేళ్లచెరువుకు చెందిన దేవేంద్రలను పోలీసులు అరెస్టు చేశారు. వాహనాన్ని సీజ్‌ చేశారు. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ రూ.65,000 వుంటుందని, కేసునమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.  సమాచారం తెలిసిన వెంటనే అప్రమత్తమై ఎర్రచందనంతోపాటు నిందితులను అరెస్ట్‌ చేయడంలో ప్రతిభ చూపిన ఎస్‌ఐ బాలక్రిష్ణతో పాటు సిబ్బందిని డీఎస్పీ రవిమనోహరాచారి, వాల్మీకిపురం సీఐ నాగార్జునరెడ్డి అభినందించారు.

Advertisement
Advertisement