ఎర్రచందనం దుంగలు స్వాధీనం

ABN , First Publish Date - 2021-04-13T05:19:46+05:30 IST

రుద్రవరం మండలంలోని నాగులవరం గ్రామ సమీపంలో ఎర్రచందనం దుంగలు అక్రమంగా తరలిస్తున్న వారిపై దాడి చేసి 11 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నా మని, ఐదుగురు నిందితులను అరెస్టు చేశామని డీఎస్పీ రాజేంద్ర తెలి పారు.

ఎర్రచందనం దుంగలు స్వాధీనం
ఎర్రచందనం దుంగలు, నిందితులతో ఆళ్లగడ్డ డీఎస్పీ

  1. ఉప సర్పంచ్‌తోపాటు నలుగురి అరెస్టు
  2. మరో ఐదుగురు పరారీ


రుద్రవరం, ఏప్రిల్‌ 12: రుద్రవరం మండలంలోని నాగులవరం గ్రామ సమీపంలో ఎర్రచందనం దుంగలు అక్రమంగా తరలిస్తున్న వారిపై దాడి చేసి  11 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నా మని, ఐదుగురు నిందితులను అరెస్టు చేశామని డీఎస్పీ  రాజేంద్ర తెలి పారు. ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశాల మేరకు కడప సబ్‌ కంట్రోల్‌ రెడ్‌స్యాం డిల్‌ టాస్క్‌ఫోర్స్‌ విభాగం ఆర్‌ఐ ఆలీ, శిరివెళ్ల సీఐ చంద్రబాబు నాయుడు పర్యవేక్షణలో దాడి చేసినట్లు  సోమవారం రుద్రవరం పోలీసు స్టేషన్‌లో తెలిపారు. తెలుగుగంగ సబ్‌ చానల్‌ టి.లింగందిన్నె గ్రామానికి వెళ్లే బండ్ల రస్తాలో 10 మంది వ్యక్తులు ఎర్రచందనం దుంగలు ఎత్తుకొని నాగులవరం వైపు వస్తుండటం చూశామని తెలి పారు. తమను చూసి వారు  దుంగలు వదిలేసి పరారయ్యారని అన్నారు. ఆర్‌.నాగులవరం ఉపసర్పంచ్‌ నల్లబోతుల సింహం, శిరివెళ్ల మండలం గంగవరానికి  చెందిన బోయ వెంకటస్వామి, దూదెకుల సిద్ధయ్య, బండిఆత్మకూరు మండలంలోని కడమల కాలువ గ్రామానికి చెందిన అమ్మకల్లు నబీసా, వెంగల్‌రెడ్డిపేటకు చెందిన దూదేకుల సిద్ధయ్యను అరెస్టు చేశామని తెలిపారు. వారి వద్ద ఉన్న సుమారు 237 కేజీల బరువుగల 11 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నామని తెలి పారు. నిందితులను కోర్టుకు హాజరుపరచగా మెజిస్ట్రేట్‌ రిమాండ్‌కు ఆదేశించినట్లు తెలిపారు. అలాగే పరారీలో ఉన్న ఆర్‌.నాగులవరం గ్రామానికి చెందిన నల్లబోతల మండ్ల నాయుడు, బాలసుబ్బి, జల్ల, దాసరి బాలమునయ్య, బండి ఆత్మకూరు మండలంలోని కడమల కాలువ గ్రామానికి చెందిన రామాంజనేయులు అలియాస్‌ అంజిల కోసం గాలిస్తున్నామని తెలిపారు.  


ఎర్రచందనం జోలికి వెళ్లవద్దు: డీఎస్పీ  

ఎర్రచందనం జోలికి వెళ్లి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆళ్లగడ్డ డీఎస్పీ రాజేంద్ర సూచించారు. ఎర్రచందనం అక్రమ రవాణా నివా రణకు స్థానిక పోలీసులతోపాటు తిరుపతి టాస్క్‌ఫోర్స్‌ బృందం పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రుద్రవరం ఇన్‌చార్జి ఎస్‌ఐ సూర్యమౌళి, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-13T05:19:46+05:30 IST