రెడ్ కాలీఫ్లవర్లతో రైతు చిట్టిబాబు
ఎంవీపీ రైతుబజారులో ఎగబడిన కొనుగోలుదారులు
ఎంవీపీ కాలనీ, జనవరి 25: ఎన్నో పోషక విలువలు వుండే రెడ్ కాలీఫ్లవర్‌ను మంగళవారం అరకు మండలం సోవా ప్రాంతానికి చెందిన రైతు చిట్టిబాబు ఎంవీపీకాలనీ రైతుబజారులో విక్రయించాడు. కిలో రూ.60కి రెడ్ కాలీఫ్లవర్‌ను విక్రయించగా వినియోగదారులు ఎగబడి వీటిని కొనుగోలు చేశారు. రెడ్ కాలీఫ్లవర్ ఇక్కడి రైతుబజారుకు రావడం ఇదే ప్రథమం. వంద రెడ్ కాలీఫ్లవర్లను ఇక్కడకు తీసుకురాగా హాట్‌కేక్‌లా అన్నీ అమ్ముడైపోయాయి. ఈ కాలీఫ్లవర్‌కు సంబంధించిన విత్తనాలను తాము ఒడిశా నుంచి తీసుకువచ్చినట్టు చిట్టిబాబు తెలిపారు. ఒక్కో కాలీఫ్లవర్ కిలో నుంచి కిలోన్నర బరువు వుందని, వీటిని ఆర్గానిక్ విధానంలో పండించినట్టు పేర్కొన్నారు.