Abn logo
Feb 22 2020 @ 01:27AM

రెడ్‌ @ డోలమైట్స్‌

యూరప్‌ దేశం ఇటలీలో డోలమైట్స్‌ అని ఓ ప్రాంతం ఉంది! అదీ సముత్రతీరానికి పదివేల అడుగుల ఎత్తులో, మైనస్‌ డిగ్రీస్‌ టెంపరేచర్‌లో, మంచు కొండల్లో!! ఇప్పటివరకూ పలు హాలీవుడ్‌ సినిమా షూటింగులు అక్కడ జరిగాయి. ఆ ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా ‘రెడ్‌’ రికార్డులకు ఎక్కింది. ‘నేను... శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ విజయాల తర్వాత యువ హీరో రామ్‌, దర్శకుడు కిశోర్‌ తిరుమల, నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్‌ కలయికలో రూపొందుతున్న హ్యాట్రిక్‌ సినిమా ‘రెడ్‌’. ‘స్రవంతి’ రవికిశోర్‌ నిర్మాత. ఒక్క పాట మినహా సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఇటీవల ఇటలీలో రెండు పాటలను తెరకెక్కించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘రామ్‌, మాళవిక శర్మపై ఇటలీలో ఈ నెల 12 నుండి 18 వరకూ టుస్కాన్‌, ఫ్లారెన్స్‌, డోలమైట్స్‌ ప్రాంతాల్లో, వెనిడియా కార్నివాల్‌లో రెండు పాటలు చిత్రీకరించాం. ఈ నెలాఖరున హైదరాబాద్‌లో మరో పాటను చిత్రీకరిస్తాం. దాంతో సినిమా పూర్తవుతుంది’’ అన్నారు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ విజయం తర్వాత రామ్‌ నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 9న విడుదల చేస్తామని చిత్రసమర్పకులు కృష్ణ పోతినేని తెలిపారు. నివేదా పేతురాజ్‌, అమృతా అయ్యర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు.

Advertisement
Advertisement
Advertisement