Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

అమరావతి : ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. తుపాను ప్రభావిత 12 తీర మండలాల్లో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వంశధార, నాగావళి వరద ప్రభావిత ప్రాంతాలుగా 237 గ్రామాలను గుర్తించారు. శ్రీకాకుళం జిల్లాలో 79 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, టెక్కలి, పలాసలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు పనిచేస్తున్నాయి. ప్రత్యేక అధికారి అరుణ్‌కుమార్‌ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. శ్రీకాకుళం కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ నెం. 08942 240557 ఏర్పాటు చేశారు. విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. 

Advertisement
Advertisement