మియామి Airportలో Red Air విమానం crash lands

ABN , First Publish Date - 2022-06-22T14:57:11+05:30 IST

డొమినికన్ రిపబ్లిక్ నుంచి మియామీ వెళుతున్న రెడ్ ఎయిర్ విమానం బుధవారం క్రాష్ ల్యాండ్ అయింది....

మియామి Airportలో Red Air విమానం crash lands

మియామి : డొమినికన్ రిపబ్లిక్ నుంచి మియామీ వెళుతున్న రెడ్ ఎయిర్ విమానం బుధవారం క్రాష్ ల్యాండ్ అయింది.ల్యాండింగ్ సమయంలో విమానం ల్యాండింగ్ గేర్ కూలిపోయింది.126 మందితో ప్రయాణిస్తున్న రెడ్ ఎయిర్ విమానం విమానాశ్రయంలో కూలిపోయిన తర్వాత మంటల్లో చిక్కుకుంది, ముగ్గురు విమాన ప్రయాణికులకు స్వల్ప గాయాలు కావడంతో వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు మియామి-డేడ్ ఏవియేషన్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి తెలిపారు.126 మందితో ప్రయాణిస్తున్న డొమినికన్ రిపబ్లిక్ ఎయిర్ క్యారియర్ రెడ్ ఎయిర్‌కు చెందిన విమానం ల్యాండింగ్ గేర్ కూలిపోవడంతో మియామీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.


ఇతర ప్రయాణీకులను విమానం నుంచి టెర్మినల్ వరకు బస్సులో తరలించారు.మియామి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. విమానంలో వెంటనే మంటలు చెలరేగాయని, అయితే ప్రయాణికులకు ఎటువంటి తీవ్ర గాయాలు కాలేదని విమానసంస్థ అధికారులు తెలిపారు. డొమినికన్ రిపబ్లిక్‌లోని శాంటో డొమింగో నుంచి అమెరికాలోని మియామీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తున్న రెడ్ ఎయిర్ విమానంలో ల్యాండింగ్ గేర్ కూలిపోవడంతో మంటలు చెలరేగాయి.


Updated Date - 2022-06-22T14:57:11+05:30 IST