అమెరికాలో తప్పిన పెను ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న 126 మంది ప్రయాణికులు!

ABN , First Publish Date - 2022-06-22T21:50:13+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో పెను ప్రమాదం తప్పింది. ఫ్లైట్ క్రాష్ ల్యాండై అగ్ని ప్రమాదం చోటు చోసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. విమానంలో ప్రయాణిస్తున్న 126 మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డా

అమెరికాలో తప్పిన పెను ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న 126 మంది ప్రయాణికులు!

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో పెను ప్రమాదం తప్పింది. ఫ్లైట్ క్రాష్ ల్యాండై అగ్ని ప్రమాదం చోటు చోసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. విమానంలో ప్రయాణిస్తున్న 126 మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 


డొమినికన్ రిపబ్లిక్ నుంచి 126 మంది ప్రయాణికులతో ఫ్లోరిడాకు బయల్దేరిన రెడ్ ఎయిర్ విమానం మియామీ ఎయిర్‌పోర్ట్‌లో క్రాష్ ల్యాండైంది. మంగళవారం సాయంత్రం  ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ అవుతుండగా.. ఫ్లైట్ ల్యాండింగ్ గేర్ దెబ్బతింది. దీంతో విమానం క్రాష్ ల్యాండైంది. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే మంటలు మరింత విస్తరించకముందే.. ప్రయాణికులు భయంతో విమానం నుంచి ఎయిర్‌పోర్టులోకి పరుగులు తీశారు. ఈ క్రమంలో వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తెచ్చారు. 



ప్రస్తుతం ఈ ప్రమాదంకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. మియామీ ఏవియేషన్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. 126 మంది ప్రయాణికుల్లో ముగ్గురికి స్వల్పంగా గాయాలైనట్టు చెప్పారు. వారిని ఆసుపత్రికి తరలించినట్టు వెల్లడించారు. ఈ ఘటనపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు స్పందించింది. ప్రమాదంపై విచారణ జరపడానికి బుధవారానికల్లా అధికారుల బృందం మియామీ చేరుకుటుందని స్పష్టం చేసింది. 




Updated Date - 2022-06-22T21:50:13+05:30 IST