Advertisement
Advertisement
Abn logo
Advertisement

వాకాడులో రేషన్‌ డీలర్ల ఆందోళన

వాకాడు, అక్టోబరు 26: మండలంలోని పౌరసరఫరాల శాఖ గోదాము వద్ద వాకాడు, కోట, చిట్టమూరు మండలాల డీలర్లు మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మండలం డీలర్ల   సంఘం అధ్యక్షుడు ఆయోధ్య వాసయ్యశె ట్టి మాట్లాడుతూ జీవో నెంబరు 10ను రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. వైఎస్‌ఆర్‌ హయాలంలో గోనెసంచులు ఇచ్చారని, అప్పటి నుంచి కమిషన్‌తోపాటు గోనెసంచులను డీలర్లు అమ్ముకుంటున్నారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కొరత పేరుతో ప్రభుత్వమే తీసుకొని ఒక్కొక్కసంచికి రూ. 20 ఇస్తామని చెప్పిందన్నారు. అధికారులు గోనె సంచులకు నగదు చెల్లించడం ఇప్పుడు సాధ్యంకాదంటున్నారు. దీనివల్ల డీలర్లు ఆర్ధికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వహణ ఖర్చులు కూడా రాకపోతే రేషన్‌షాపులు ఎలా నడపాలని ప్రశ్నించారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, రవి, వంజివాక దిబ్బయ్య, షేక్‌. హుమయన్‌ సాహెబ్‌ తదితరులు పాల్గొన్నారు. 


చిల్లకూరులో..


చిల్లకూరు, అక్టోబరు 26: సమస్యలను పరిష్కరించాలని మండలంలోని రేషన్‌ డీలర్లు మంగళవారం గూడూరులోని స్టాక్‌పాయింట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డీలర్లు మాట్లాడుతూ తమకు చెల్లించాల్సిన అనంతరం గోదాము డీటీ వెంకటేశ్వర్లుకు వితనతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మధుసూదన్‌రెడ్డి, సురేంద్రరెడ్డి, సాయి, వెంకటరమణయ్య, శీను, తదితరులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement