మళ్లీ నియామకాలు!?

ABN , First Publish Date - 2020-05-22T06:58:21+05:30 IST

కరోనా సంక్షోభంతో దేశంలో నిరుద్యోగిత రేటు ఇప్పటికే గరిష్ఠ స్థాయిని తాకినట్లుందని ఉద్యోగ నియామక సేవలందించే క్వెస్‌కార్ప్‌ పేర్కొంది. లాక్‌డౌన్‌ నుంచి క్రమంగా బయటపడుతున్న బడా కంపెనీలు ఉద్యో గ నియామకాలను...

మళ్లీ నియామకాలు!?

  • జాబ్‌ మార్కెట్లో గడ్డు కాలం దాదాపు ముగిసినట్లే: క్వెస్‌కార్ప్‌ 


కరోనా సంక్షోభంతో దేశంలో నిరుద్యోగిత రేటు ఇప్పటికే గరిష్ఠ స్థాయిని తాకినట్లుందని ఉద్యోగ నియామక సేవలందించే క్వెస్‌కార్ప్‌ పేర్కొంది. లాక్‌డౌన్‌ నుంచి క్రమంగా బయటపడుతున్న బడా కంపెనీలు ఉద్యో గ నియామకాలను తిరిగి ప్రారంభించే ప్రయత్నాల్లో ఉన్నాయంటోంది. ‘జూన్‌, జూలైలో నియామకాల అవసరాల కోసం పలు బడా కంపెనీలు మాతో ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించాయి. లాక్‌డౌన్‌కు ముందు ఏర్పాటు చేసుకున్న హైరింగ్‌ ప్రణాళికలో కనీసం 70 శాతం నియామకాలైనా జరపాలని కంపెనీలు భావిస్తున్నాయి. జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో ఈ సంఖ్య మరింత పెరిగేందుకు అవకాశముంది. దీన్నిబట్టి చూస్తే, ఉద్యోగ మార్కెట్లో గడ్డుకాలం దాదాపు ముగిసినట్లే కన్పిస్తోంద’ని క్వెస్‌కార్ప్‌ చైర్మన్‌ అజిత్‌ ఇసాక్‌ అన్నారు. నిరుద్యోగ రేటు  మళ్లీ తగ్గుముఖంపట్టిందని.. ఆర్థిక సేవలు, హెల్త్‌కేర్‌, లాజిస్టిక్స్‌ రంగాల్లో హైరింగ్‌ తిరిగి పుంజుకోనుందన్నారు. వ్యవస్థీకృత ప్రైవేట్‌ రంగానికి మానవ వనరులు సమకూర్చే అతిపెద్ద స్టాఫింగ్‌ కంపెనీల్లో క్వెస్‌కార్ప్‌ ఒకటి. లాక్‌డౌన్‌ కారణంగా 12.2 కోట్ల మంది ఉద్యోగం లేక ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది. దేశ కార్మిక శక్తిలో వీరి వాటా 15 శాతమే. చాలా వరకు ఉద్యోగాలు కల్పించేది అవ్యవస్థీకృత రంగమే. 


  • డేటా నిపుణులకు పెరగనున్న డిమాండ్‌ 

కొవిడ్‌-19 తర్వాత దశలో ప్రపంచవ్యాప్తంగా డేటా సైన్స్‌ నిపుణులకు డిమాండ్‌ పెరగనుందని  జిగ్‌సా అకాడమీ అంటోంది. కరోనా సంక్రమణను కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌లో పలు రంగాల కంపెనీల ఉద్యోగులు ఇంటి నుంచి పని (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) చేయాల్సి వచ్చింది. మాంద్యం నేపథ్యంలోనూ ఈ ట్రెండ్‌ కొనసాగనుందంటోంది. 


Updated Date - 2020-05-22T06:58:21+05:30 IST