పోగొట్టుకున్న బంగారం రికవరీ

ABN , First Publish Date - 2021-08-06T06:33:13+05:30 IST

ఆటోలో బంగారు నగలున్న బ్యాగును పోగొట్టుకున్న బాధితులకు కేవలం 10 నిమిషాల్లో పోలీసులు అప్పగించారు

పోగొట్టుకున్న బంగారం రికవరీ

ఆటోలో బంగారు నగల బ్యాగును మరిచిపోయిన మహిళ

పోలీసులకు ఫిర్యాదు

10 నిమిషాల్లో  ఆచూకీని కనుగొన్న పోలీసులు

ధర్మవరం, ఆగస్టు 5: ఆటోలో బంగారు నగలున్న బ్యాగును పోగొట్టుకున్న బాధితులకు కేవలం 10 నిమిషాల్లో పోలీసులు అప్పగించారు పోలీసులు. సీఐ తెలిపిన వివరాల మేరకు... చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దల గ్రామానికి చెందిన బాబు, సువర్ణ బెంగుళూర్‌లో సెలూనషాపు పెట్టుకుని జీవిస్తున్నారు. రెండురోజులక్రితం న్యామద్దలకు  వచ్చారు. అయితే బుధవారం పట్టణంలోని దు ర్గానగర్‌లోని పుట్టింటికి వచ్చారు. పట్టణంలోని సాయిబాబా గుడి వద్ద ఆటోను ఎక్కి దుర్గానగర్‌లోని ఇంటి వద్ద దిగారు. ఆటో ఆరున్నర తులాల బంగారం ఉన్న బ్యాగును మరచిపోయారు. ఆటో డ్రైవర్‌కూడా ఆ బ్యాగును గమనించలేదు. వెం టనే బాధితులు బాబు, సువర్ణ, బంధువు హరి ప్రసాద్‌లు పోలీసులకు సమా చారం అందించారు. దీంతో సీఐ కరు ణాకర్‌వెంటనే స్పందించి పోలీసులు షాకీర్‌, మధు, ప్రసన్న, ఉమాశంకర్‌లద్వారా ఆటోను ట్రేస్‌ ఔట్‌ చేయాలని ఆదేశించారు. దీంతో పట్టణంలో వారు ఆటోకోసం గాలించగా చివరికి ఆటోను పట్టుకుని అం దులో బంగారం ఉన్న బ్యాగును తీసుకుని బాధితులకు అప్పగించారు. ఊపిరి పీల్చుకున్న బాధితులు సీఐ కరుణాకర్‌, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.డీఎస్పీ రమాకాంత సీఐ, సిబ్బందిని అభినందించారు.

Updated Date - 2021-08-06T06:33:13+05:30 IST