రికవరీ గుబులు

ABN , First Publish Date - 2022-08-17T04:08:34+05:30 IST

ఉపాధి హామీ పఽథకంలో నిబంధనలను యఽథేచ్చగా ఉల్లంఘించారు. లేబర్‌ కన్నా, మెటీరియల్‌ పనులపైనే ఆసక్తి చూపారు. ఐదేళ్లకోసారి చేయాల్సిన పూడికతీత పనులు ఏటా చేయడం, గుట్టల్లో చేయాల్సిన పనులు పొలాల్లో చేయడం.. ఇలా ఇష్టానుసారంగా వ్యవహరించారు.

రికవరీ గుబులు
గండీడ్‌లో చేపడుతున్న ఉపాధి హామీ పనులు(ఫైల్‌)

ఉపాధి హామీ పనుల్లో నిబంధనల ఉల్లంఘన 

2018-19లో లేబర్‌కన్నా మెటీరియల్‌ ఖర్చే ఎక్కువ

దుర్వినియోగం అయిన నిధులు రికవరీ చేయాలని కేంద్రం ఆదేశాలు


ఉపాధి హామీ పఽథకంలో నిబంధనలను యఽథేచ్చగా ఉల్లంఘించారు. లేబర్‌ కన్నా, మెటీరియల్‌ పనులపైనే ఆసక్తి చూపారు. ఐదేళ్లకోసారి చేయాల్సిన పూడికతీత పనులు ఏటా చేయడం, గుట్టల్లో చేయాల్సిన పనులు పొలాల్లో చేయడం.. ఇలా ఇష్టానుసారంగా వ్యవహరించారు. అయితే కేంద్ర ప్రభుత్వ విచారణలో ఈ లొసుగులు బయటపడటంతో దుర్వినియోగం అయిన నిధుల రికవరీకి డెడ్‌లైన్‌ విధించారు. దాంతో పథకం ఉద్యోగుల్లో టెన్షన్‌ నెలకొన్నది.

- మహబూబ్‌నగర్‌ 

ఉపాధిహామీ పథకంలో లేబర్‌ పనులే ఎక్కువగా చేయించాలన్న నిబంధనలు ఉన్నాయి. లేబర్‌ 60 శాతం, మెటీరియల్‌ 40 శాతం ఉండాలని స్పష్టం చేయగా, పాలమూరు జిల్లాలో మాత్రం మెటీరియల్‌ పేమెంట్‌ పనులే ఎక్కువగా జరుగుతున్నాయని తెలుస్తోంది. 2018-19లో జిల్లాలో 51.19 శాతం మెటీరియల్‌ పేమెంట్‌ చేశారు. అంటే 11 శాతానికిపైగా నిధులను మెటీరియల్‌కు వినియోగించారు. ఈ ఏడాది పథకం కింద రూ.160.92 కోట్లు ఖర్చు చేశారు. అందులో లేబర్‌ పేమెంట్‌ రూ.64.07 కోట్లు కాగా, మెటీరియల్‌ పే మెంట్‌ కింద రూ.67.18 కోట్లు ఖర్చు చేశారు. అదే 2020-21లో 44.22 శాతం మెటీరియల్‌ పేమెంట్‌ జరిగింది. లేబర్‌కు రూ.80.04 కోట్లు, మెటీరియ ల్‌కు రూ.63.46 కోట్లు ఖర్చు చేశారు. 2021- 22లో మెటీరియల్‌కు రూ.44.56 శాతం, లేబర్‌కు రూ.67.20 కోట్లు ఖర్చు చేయగా, మెటీరియల్‌కు రూ.54.01 కోట్లు ఖర్చు చేశారు. 


సీసీ రోడ్లు.. కల్లాలు.. రైతువేదికలు

పథకం కింద రైతుల భూ ములు చదును చేయడం, రాళ్లు, రప్పలుంటే తొలగించడం, నీటి నిల్వ కోసం కందకాలు తవ్వ డం, బండింగ్‌ చేయడం, డొంగులు, వంపుల్లో రాతి కట్టడాలు కట్టడం. ఊట కుంటలు నిర్మిం చడం, పండ్లతోటల పెం పకం, పాటు కాలు వల్లో పూడిక తీయ డం వంటి పనులు కొత్తలో చేసేవారు. రానురాను పథకం స్వరూపం మార్చి మెటీరియల్‌కు సంబం ధించిన పనులే ఎక్కువగా చేస్తున్నారు. రైతు వేదికలు, శ్మశానవాటికలు, కల్లాలు, పశువుల షెడ్లు, డంపింగ్‌ యార్డ్‌లు, గ్రామ పంచా యతీ భవనాలు, సీసీరోడ్లు, అంగన్‌వాడీ భవనాలు వంటి మెటీరియల్‌తో ముడి పడిన పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లాలో దాదాపుగా అన్ని చోట్ల రైతువేదికలు, శ్మశానవాటికల నిర్మాణాలు పథకం కింద చేపట్టారు. పలు చోట్ల గ్రామ పంచాయతీ భవనాలు కూడా నిర్మించారు. దీంతో లేబర్‌కన్నా మెటీరి యల్‌ పేమెంట్‌ పెరిగిపోతుంది. ఈ పనులన్నీ కాంట్రాక్టర్లే చేస్తుండటంతో మెటీరియల్‌ ఖర్చు కూడా పెరిగిపోతోంది. ఇక సీసీ రోడ్ల కోసం గ్రామాల్లో లక్షలకు లక్షలు వెచ్చిస్తున్నారు. గత జనవరి వరకు జిల్లాలో జరిగిన పనుల ప్రకారం లేబర్‌ పేమెంట్‌లు ఎంత జరిగాయో చూసుకుని, 40 శాతం మెటీరియల్‌కు సంబంధించి ఖర్చు చేయాల్సిన నిధులను సీసీరోడ్లకు వెచ్చించి మార్చిలోనే పనులు పూర్తి చేస్తున్నారు. గ్రామం యూనిట్‌గా మెటీ రియల్‌ పేమెంట్‌ను వినియో గిస్తున్నారు. గ్రామంలో రూ.60 లక్షలు లేబర్‌ పేమెంట్‌ జరిగితే, రూ.40 లక్షలు మెటీరియల్‌ పేమెంట్‌కు అవకాశం ఉండటంతో జనవరి వరకు జరిగిన మెటీరియల్‌ పేమెంట్‌ను కలుపుకుని ఆ నలభై లక్షల రూపాయలు భర్తీ అయ్యేలా సీసీ రోడ్ల పనులు చేపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో నిబంధనలు ఉల్లంఘించి  మెటీరియల్‌ నిధులను అధికంగా వినియోగిస్తున్నారు. ఈ సీసీ రోడ్ల పనులను కూడా గ్రామాల్లో కార్యకర్తలు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి చేస్తున్నారు.


కొత్త సాఫ్ట్‌వేర్‌తో చెక్‌

ఉపాధి హామీ పథకానికి ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తుందని, నిబంధనలు ఉల్లంఘించిన ఇష్టానుసారంగా పనులు మారుస్తూ ప్రచారం చేసుకుంటున్నారని కేంద్రం రాగాస్‌ సాఫ్ట్‌వేర్‌ స్థానంలో ఈ ఏడాది ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం పొందుపరిచిన పనులే తప్ప, వాటిని మార్చి కొత్త పనులు చేపట్టడానికి వీలులేదు. అదేవిధంగా నిధులు నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోనే వేస్తారు. అయితే గతంలో నిబంధనలు ఉల్లంఘించి, దుర్వినియోగం చేసిన నిఽధులు రికవరీ చేయాలని ఆదేశించడంతో క్షేత్రస్థాయి సిబ్బందిలో ఆందోళన నెలకొంది.



Updated Date - 2022-08-17T04:08:34+05:30 IST