అత్యవసర చికిత్స నుంచి కోలుకొని.. మళ్లీ ఆస్పత్రికి!!

ABN , First Publish Date - 2020-09-17T08:09:33+05:30 IST

కరోనా అత్యవసర చికిత్స నుంచి పూర్తిగా కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయిన ప్రతి పది మంది కొవిడ్‌ రోగుల్లో ఒకరు (10 శాతం మంది) మళ్లీ ఆస్పత్రులకు తిరిగొస్తున్నారట...

అత్యవసర చికిత్స నుంచి కోలుకొని.. మళ్లీ ఆస్పత్రికి!!

వాషింగ్టన్‌, సెప్టెంబరు 16: కరోనా అత్యవసర చికిత్స నుంచి పూర్తిగా కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయిన ప్రతి పది మంది కొవిడ్‌ రోగుల్లో ఒకరు (10 శాతం మంది) మళ్లీ ఆస్పత్రులకు తిరిగొస్తున్నారట!! అది కూడా డిశ్చార్చి అయిన వారంలోపు!! మార్చి 1 నుంచి 28 మధ్య తేదీల్లో ఆస్పత్రులను సందర్శించిన 1,419 కొవిడ్‌ రోగుల ఆరోగ్య స్థితిగతుల వివరాల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చినట్లు అమెరికాలోని పెన్సిల్వేనియా వర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. 4.7 శాతం మంది డిశ్చార్జి అయి వారం కూడా గడవకముందే, ఆస్పత్రులకు తిరిగి వచ్చారని, పలువురికి మళ్లీ ‘పాజిటివ్‌’ వచ్చిందని తెలిపారు. అత్యల్ప పల్స్‌ ఆక్సీమెట్రీ స్థాయులు, దీర్ఘకాలిక వ్యాధులు తీవ్రమవడం వంటి ప్రతికూలతలను వారు ఎదుర్కొన్నారని తెలిపారు.

Updated Date - 2020-09-17T08:09:33+05:30 IST