నటుడు కమల్‌హాసన్ కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఆయనకు వైద్య చికిత్స అందించిన శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ ఈ విషయాన్ని బుధవారం తెలిపింది. ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. రెండు రోజుల విశ్రాంతి అనంతరం కమల్‌హాసన్ ఎప్పటిలా తన రోజువారీ కార్యక్రమాలు కొనసాగించవచ్చని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. కొవిడ్ పాజిటివ్‌గా తేలడంతో నవంబరు 22న కమల్‌హాసన్ హాస్పిటల్లో చేరారు.