Abn logo
Sep 19 2021 @ 12:45PM

Kurnool: ఓటమిని అంగీకరించక.. రీకౌంటింగ్‌కు పట్టుబట్టిన వైసీపీ అభ్యర్థి.. చివరికి..

కర్నూలు: కోడుమూరు మండలం వెంకటగిరి ఎంపీటీసీ స్ధానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. నాలుగు ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి సుజాత వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. దీంతో వైసీపీ అభ్యర్థి ఓటమిని అంగీకరించక.. రీకౌంటింగ్‌కు పట్టుబట్టారు. ఎన్నికల అధికారులు రీకౌంటింగ్ నిర్వహించగా వెంకటగిరిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరికి రీకౌంటింగ్‌లో కూడా టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. రెండు ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థిపై సుజాత విజయం సాధించారని అధికారులు వెల్లడించారు.