రికార్డులు సక్రమంగా ఉండాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-10-19T06:00:31+05:30 IST

జిల్లా కార్యాలయాల్లో రికార్డులు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అధికారులకు సూచించారు. సోమ వారం కార్యాలయంలో స్వచ్చ డ్రైవ్‌లో భాగంగా పలు కార్యాలయాలను సందర్శించారు. సెల్ఫ్‌లో రికార్డులు భద్రంగా పెట్టాలని తెలిపారు.

రికార్డులు సక్రమంగా ఉండాలి : కలెక్టర్‌
కార్యాలయాల్లో పరిశుభ్రతను పరిశీలిస్తున్న కలెక్టర్‌

కామారెడ్డి, అక్టోబరు 18: జిల్లా కార్యాలయాల్లో రికార్డులు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అధికారులకు సూచించారు. సోమ వారం కార్యాలయంలో స్వచ్చ డ్రైవ్‌లో భాగంగా పలు కార్యాలయాలను సందర్శించారు. సెల్ఫ్‌లో రికార్డులు భద్రంగా పెట్టాలని తెలిపారు. కార్యాలయాల్లో అవ సరం లేని పేపర్లను తొలగించాలని పేర్కొన్నారు. పాడైన ఎలకా్ట్రనిక్‌ వస్తువులను తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతీనెల ఒక రోజు స్వచ్చత డ్రైవ్‌ను ఉద్యోగులు నిర్వహించాలని తెలిపారు. ఇందులో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ వెంకటమాధవరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రజావాణికి 46 ఫిర్యాదులు

జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 46 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ తెలిపారు. ఇందులో రెవెన్యూ 37, వ్యవసాయశాఖ 2, వైద్యశాఖ 2, గ్రామ పంచాయతీ 3, మున్సిపల్‌ 2 చొప్పున ఫిర్యాదులు వచ్చినట్లు వివరించారు.

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

కామారెడ్డి టౌన్‌: ఇంటర్‌మీడియట్‌ ప్రథమ సంవత్సర పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. సోమవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో టెలీ కాన్ఫరెన్స్‌లో అధికారులతో మాట్లాడుతూ ఈనెల 25 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలుచేయాలని సూచించారు. పరీక్షల నిర్వహణ సమయంలో జిరాక్స్‌ కేంద్రాలు మూసి ఉంచాలని తెలిపారు. జిల్లాలో 42 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు వివరించారు. పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లుగా ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను నియమించాలని డీఈవో రాజును ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఆరోగ్యకార్యకర్తలు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని వైద్యశాఖ అధికారులు పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్‌నోడల్‌ అధికారి షేక్‌సలాం,డీయంహెచ్‌వో కల్పనకాంటే, రెవెన్యూ, ఆర్టీసీ, విద్యుత్‌ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-19T06:00:31+05:30 IST