గరుడాసనంలో రికార్డు బ్రేక్‌!

ABN , First Publish Date - 2021-06-22T05:23:22+05:30 IST

గరుడాసనంలో రికార్డు బ్రేక్‌!

గరుడాసనంలో రికార్డు బ్రేక్‌!
ఆసనం వేస్తున్న వంశీకృష్ణ

తాండూరు: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వికారాబాద్‌ జి ల్లా తాండూరుకు చెందిన మూన్‌వాకర్‌ వంశీకృష్ణ సోమవారం గరుడాసనం వేసి గత రికా ర్డును బ్రేక్‌ చేశాడు. వంశీకృష్ణ హైదరాబాద్‌లోని తన నివాసంలో గరుడాసనం వేశాడు. గతంలో గరుడాసనంలో క్రిషన్‌ అనే వ్యక్తి 5 నిమిషాల 9సెకన్లు నిరవధికంగా చేసి రికార్డు సృష్టించగా, వంశీకృష్ణ 5నిమిషాల 19సెకెన్లు నిరవధింగా చేసి పాత రికార్డ్‌ను బ్రేక్‌ చేశా డు. దీనిపై వంశీకృష్ణ మాట్లాడుతూ ఈ రికార్డును జాతీయ, అంతర్జాతీయ రికార్డులకు పంపుతానని తెలిపాడు.

Updated Date - 2021-06-22T05:23:22+05:30 IST