అలిపిరి కాలినడక మార్గంలో పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తాం: సింఘాల్

ABN , First Publish Date - 2020-08-15T21:52:21+05:30 IST

విశాఖ, సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, భువనేశ్వర్‌లో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయాల్లో త్వరలో మహాకుంభాభిషేకం నిర్వహిస్తామని టీటీడీ ఈవో సింఘాల్ తెలిపారు.

అలిపిరి కాలినడక మార్గంలో పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తాం: సింఘాల్

తిరుపతి: విశాఖ, సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, భువనేశ్వర్‌లో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయాల్లో త్వరలో మహాకుంభాభిషేకం నిర్వహిస్తామని టీటీడీ ఈవో సింఘాల్ తెలిపారు. ఈ నెలాఖరులో అలిపిరి కాలినడక మార్గంలో పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. స్విమ్స్ కోవిడ్ ఆసుపత్రిలో వైద్య పరికరాల కోసం రూ.19 కోట్లు, అభివృద్ధి పనులకు రూ.8.50 కోట్లు, తిరుమలలో నిఘా కోసం మూడో దశలో రూ.20 కోట్లతో 1300 సీసీ కెమెరాల ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అలిపిరి జూపార్కు సమీపంలో రూ.34.50 కోట్లతో ఎస్వీ బధిర పాఠశాల, కళాశాల, రూ.14 కోట్లతో ఎస్వీ ప్రత్యేక ప్రతిభావంతుల శిక్షణ సంస్థ హాస్టల్ భవనాల నిర్మిస్తున్నామని సింఘాల్ తెలిపారు.


Updated Date - 2020-08-15T21:52:21+05:30 IST