శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ పునర్నిర్మాణం

ABN , First Publish Date - 2022-01-21T06:49:33+05:30 IST

జిల్లా కేం ద్రంలోని రామగిరిలో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది.

శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ పునర్నిర్మాణం
నల్లగొండ పట్టణం రామగిరిలోని రామాలయం

రూ.1.80 కోట్లతో నిర్మాణ పనులు  

అనుమతించిన ప్రభుత్వం 

నల్లగొండ, జనవరి 20: జిల్లా కేం ద్రంలోని రామగిరిలో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం జీవో ఆర్టీ నెంబరు 24ను జారీ చేసింది. నల్లగొండకు చెందిన వివిధ రంగాల్లో స్థిరపడిన ఐదుగురు ప్రముఖులు ఈ దేవాలయ పునర్నిర్మాణానికి ముందుకొచ్చారు. రూ. 1.80 కోట్ల వరకు ఖర్చు అవుతుండటంతో ఈ ఖర్చంతా వారే భరించనున్నారు. ప్రభుత్వ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా అనుమతితో పాటు జీవో కూడా ఇ చ్చింది. ఈ నిధుల ద్వారా దేవాలయంలో ఉత్తరద్వార నిర్మాణం, అద్దాల మండపం, ఆండాళ్‌ కల్యాణ మండప నిర్మాణం స్థానంలో శాశ్వత షెడ్‌ నిర్మాణం చేయనున్నారు. గోపురం నుంచి కూడా నీరు లీకవుతుండటంతో నిర్మాణాలు చేపట్టనున్నారు. ఆరు నెలల్లో ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలని పేర్కొంది. ఇందుకు సంబంధించి చకిలం వేణుగోపాల్‌, పి. ప్రియాంక, కె.లక్ష్మీనారాయణ, జయప్రద, స్వామి, హన్మంతు, శ్రీనివాస్‌చారిలో కూడిన ఏడుగురు సభ్యులతో ఓ కమిటీని కూడా వేసింది. 



Updated Date - 2022-01-21T06:49:33+05:30 IST