Abn logo
Sep 27 2021 @ 01:07AM

ముగ్గురు ఉద్యోగులపై వేటుకు సిఫార్సు

డాక్యుమెంట్‌ రైటర్లపై పోలీసులకు ఫిర్యాదు

చలానాల అక్రమాలపై ఉన్నతాధికారులకు నివేదిక

అనంతపురం క్రైం, సెప్టెంబరు 26 : కదిరి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో చలానాల అక్రమ వ్యవహారంలో భాగస్వాములైన ముగ్గురు ఉద్యోగులపై ఎట్టకేలకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఉన్నతాధికారులకు నివేదిక అందజేసినట్లు సమాచారం. అలాగే నలుగురు డాక్యుమెంట్‌ రైటర్లపై పోలీసు కేసులు నమోదు చేయనున్నారు. సో మవారం విచారణ అధికారి, హిందూపురం జిల్లా రిజిసా్ట్రర్‌ ఉమాదేవి ఆధ్వర్యంలో కదిరి సబ్‌ రిజిసా్ట్రర్‌ కుమార్‌స్వామిరెడ్డి  కదిరి పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆ శాఖ వర్గాల నుంచి తెలిసింది. సుమారు 56 డాక్యుమెంట్‌లకు సంబంధించి రూ. 21 లక్షలు స్వాహా చేసినట్లు తేలి ంది. ఇందులో క్రయ విక్రయదారుల నుంచి కట్టించాల్సిన చలానాల మొత్తాన్ని నలుగురు డాక్యుమెంట్‌ రైటర్లు స్వాహా చేసి  డాక్యుమెంట్‌లు సృష్టించి సమర్పించినట్లు బహిర్గతమైంది. కాగా.. చలానాలను పరిశీలించకుండా ఆ సమయంలో పనిచేసిన ముగ్గురు ఉద్యోగులు రిజిస్ట్రేషన్లు చేశారు. ఈ వ్యవహారంలో ఆ ముగ్గురు ఉద్యోగులకు పెద్ద మొత్తంలోనే ఆ డాక్యుమెంట్‌ రైటర్లు ముట్టచెప్పినట్లు సమాచారం. ఇలా డాక్యుమెంట్‌ రైటర్లు, ముగ్గురు ఉద్యోగులు కలిసి   చలానాల వ్యవహారంలో భాగస్వాములైనట్లు విచారణలో వెల్లడైందని తెలిసింది. ముగ్గురు ఉద్యోగులపై కూడా పూర్తి స్థాయి విచారణ చేసి ఆశాఖ ఉన్నతాధికారుల కు విచారణ అధికారి ఉమాదేవి ఆదివారం నివేదిక అందజేశారని శాఖ వర్గాల ద్వారా తెలిసింది. వీరిపై  నేడో, రేపో శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.


కాజేసిన డబ్బును జమ చేసిన ఉద్యోగులు

కదిరి సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయంలో  చలానాల అక్రమ వ్యవహారంలో ఆకస్మిక తనిఖీలో వెలుగు చూసిన స్వాహా చేసిన మొత్తం రూ. 21.50 లక్షలను గుట్టుచప్పుడు కాకుండా విచారణ ప్రారంభం కాకముందే అదే కార్యాలయంలో పనిచేసిన ముగ్గురు ఉద్యోగులు ఆనలైనలో జమ చేసినట్లు ఆశాఖ వర్గాల ద్వారా తెలిసింది. ఈ క్రమంలో హిందూపురం జిల్లా రిజిసా్ట్రర్‌ ఉమాదేవితో పాటు మరికొందరు ఉద్యోగులు కలిసి గత నాలుగు రోజులుగా లోతుగా విచారణ చేస్తున్నారు. ఈక్రమంలో తమపై ఎలాంటి శాఖాపరమైన చర్యలు పడకుండా అవినీతిపరులైన ఉద్యోగులు పైరవీల కు తెరలేపినట్లు సమాచారం. ఈక్రమంలో  పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులతో విచారణ అధి కారులపై ఒత్తిడి చేయిస్తున్నారని తెలిసింది.  విచారణలో గుర్తించిన లోపాలపై సమగ్రంగా ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తారా..? లేక ఒత్తిళ్లకు తలొగ్గి ఏమైనా నివేదికను తారుమారు చేసి తప్పు చేసిన ఉద్యోగులపై నామమాత్రపు చర్యలతో సరిపెడతారా..? అన్న అనుమానాలు లేకపోలేదు. స్వాహా చేసిన డబ్బును ఆకస్మిక తనిఖీలు చేసిన వెంటనే విచారణ జరుగుతుండ గా.. రాత్రికి రాత్రే ఆనలైనలో జమ చేయడం పలు విమ ర్శలకు తావిస్తోంది.  ఆకస్మిక తనిఖీలో వెలుగు చూసిన ప్రకారం నగదు స్వాహా చేసిన వారిపై తప్పకుండా చర్య లు తీసుకుంటామని ఆశాఖ డీఐజీ మాధవి తెలియజేశారు. నివేదిక రాగానే ఆ ఉద్యోగులపై చర్యలు తీసుకుని భవిష్యతలో ఇలాంటి వాటికి తావులేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.