పార్టీలో కష్టపడే వారికే గుర్తింపు

ABN , First Publish Date - 2022-06-29T05:31:23+05:30 IST

తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసేవారికి గుర్తింపు ఉంటుందని, రానున్నరోజుల్లో అలాంటి వారినే పార్టీ పదవులు వరిస్తాయని తంబళ్లపల్లె మాజీఎమ్మెల్యే జి.శంకర్‌యాదవ్‌ పేర్కొన్నారు.

పార్టీలో కష్టపడే వారికే గుర్తింపు
సమావేశంలో మాట్లాడుతున్న మాజీఎమ్మెల్యే శంకర్‌యాదవ్‌

టీడీపీ జెండా ఎగరాలి..చంద్రబాబు సీఎం కావాలి నేతలు, కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శంకర్‌యాదవ్‌ 

మదనపల్లె, జూన్‌ 28: తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసేవారికి  గుర్తింపు ఉంటుందని, రానున్నరోజుల్లో అలాంటి వారినే పార్టీ పదవులు వరిస్తాయని తంబళ్లపల్లె మాజీఎమ్మెల్యే జి.శంకర్‌యాదవ్‌ పేర్కొన్నారు. తంబళ్లపల్లెలో టీడీపీ జెండా ఎగరాలి..చంద్రబాబు సీఎం కావాలన్న ధ్యే యంతో మనమంతా కలసికట్టుగా పనిచేయాలని సూచించారు. స్థానిక సొసైటీకాలనీలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆరు మం డలాల పార్టీ అధ్యక్షుడు, గ్రామకమిటీ అధ్యక్షులు, పార్టీముఖ్యనేతలతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్‌ మా ట్లాడుతూ ప్రస్తుతం పార్టీ ప్రతిపక్షంలో ఉంటూ కష్టకాలంలో ఉందని, దాన్ని బతికించుకోవడానికి మనకుటుంబ సభ్యులంతా కష్టపడి పనిచే యాలని పిలుపునిచ్చారు. 

తంబళ్లపల్లెలో అధికార పార్టీ అక్రమార్కులను ఎదుర్కోవడం ఒక ఎత్తయితే, సొంత పార్టీలోనే కొందరు స్వార్థపరుల ఆగడాలను ఎదుర్కోవాల్సివస్తోందన్నారు. ప్రస్తుతం మండల, గ్రామ స్థాయిలో పదవులున్న ప్రతి ఒక్కరూ పార్టీకి కష్టపడాల్సిందేనని, ఇందు లో ఎవరికి ఎలాంటి మినహాయింపు ఉండదన్నారు. పనిచేయని వారినే తానే నిర్ధాక్షిణ్యంగా పక్కన పెట్టి, మరొకరికి బాధ్యతలు అప్పగిస్తానని ప్రకటించారు.  జిల్లా స్థాయి మినీ మహానాడు ఎప్పుడు జరిగినా విజయ వంతం చేయడానికి అందరమూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీచేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహణలో రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచామని, అదేవిధంగా సభ్యత్వ నమోదు, ఓటరు జాబితా గుర్తింపు, పార్టీ ఓటర్లు, కార్యకర్తల సమస్యల పరిష్కారంలోనూ ముందుండాలని హితవు పలికారు. రాజంపేట స్థాయిలో జరిగే మినీమ హానాడు ఎప్పుడు జరిగినా..నియోజకవర్గం నుంచి15 నుంచి 20వేల మం ది పార్టీ కుటుంబసభ్యులు, నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని, ఆ బాధ్యతను గ్రామస్థాయి, మండలస్థాయిలో నేతలు తీసుకో వాలని శంకర్‌ దిశానిర్దేశం చేశారు. ములకలచెరువు, పెద్దమండ్యం, తంబళ్లపల్లె, కురబలకోట, పెద్దతిప్పసముద్రం, బి.కొత్తకోట, బి.కొత్తకోట టౌన్‌ పార్టీ మండలాధ్యక్షులు పి.సిద్దప్ప, జి.వెంకటరమణ, వి.రెడ్డెప్పరెడ్డి, వై.జి.సురేం ద్రయాదవ్‌, ఎన్‌.ఆనందరెడ్డి, డి.నారాయణస్వామిరెడ్డి, బంగారు వెంకట రమణప్ప, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-29T05:31:23+05:30 IST