పోటీతత్వంతోనే ప్రతిభకు గుర్తింపు

ABN , First Publish Date - 2021-10-27T05:04:02+05:30 IST

విద్యార్థులు పోటీతో చదివినపుడే వారి ప్రతిభకు గుర్తింపు లభిస్తుందని జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి అంబవరం ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

పోటీతత్వంతోనే ప్రతిభకు గుర్తింపు
విద్యార్థులతో మాట్లాడుతున్న జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి అంబవరం ప్రభాకర్‌రెడ్డి

 సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి ప్రభాకర్‌రెడ్డి

సంబేపల్లె, అక్టోబరు26: విద్యార్థులు  పోటీతో చదివినపుడే వారి ప్రతిభకు గుర్తింపు లభిస్తుందని జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి అంబవరం ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం   మండలంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ఆదర్శ పాఠశాల, కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సంబేపల్లె జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మాట్లాడుతూ సమగ్ర శిక్ష ద్వారా అందుతున్న పథకాలను విద్యార్థులు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పాఠ్యపుస్తకాలు, జగనన్న విద్యా కానుక పట్ల సరఫరాపై ఆరాతీశారు. కాగా పాఠశాలకు మౌలిక వసతులు కల్పించా లని పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ బుజ్జిరెడ్డి ఆయనను కోరారు.  ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నరసింహారెడ్డి,  ఎంఈవో గిరివరదయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-27T05:04:02+05:30 IST