అంకితభావంతో చేసిన సేవకు గుర్తింపు సాధ్యం

ABN , First Publish Date - 2022-01-22T06:15:08+05:30 IST

అంకిత భావంతో పనిచేసిన ప్రతి వ్యక్తికి వైసీపీలో గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌ పేర్కొన్నారు.

అంకితభావంతో చేసిన సేవకు గుర్తింపు సాధ్యం
మురళీకృష్ణను సన్మానిస్తున్న ఎమ్మెల్యే

కనిగిరి, జనవరి 21: అంకిత భావంతో పనిచేసిన ప్రతి వ్యక్తికి వైసీపీలో గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌ పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా ఎన్నికైన డాక్టర్‌ పెరుగు మురళీకృష్ణను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ఉన్నతికి నిబద్దతతో పనిచేసే ప్రతి కార్యకర్తకు సమన్యాయం చేస్తానన్నారు. పార్టీకి విధేయుడుగా పనిచేసిన డాక్టర్‌ పెరుగు మురళీకృష్ణకు ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా నామినేటెడ్‌ పదవిరావడం సంతోషంగా ఉందన్నారు. పదవులు పొందిన ప్రతి ఒక్కరూ ప్రజలకు మరింత సేవలు అందించి ఆ పదవులకే వన్నెతేవాలన్నారు. అనంతరం డాక్టర్‌ మురళీకృష్ణ మాట్లాడుతూ తనకు పదవిరావడం పట్ల విశేష కృషి చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతాబుద్డుడనై ఉంటానన్నారు. మెడికిల్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా ఎన్నిక చేసిన సీయం జగన్‌మోహన్‌రెడ్డికి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేలా మెడికల్‌ బోర్డుకు తన పరిధి మేరకు సూచనలు, సలహాలు అందచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌, జడ్పీటీసీ కస్తూరిరెడ్డి, వైసీపీ నాయకులు రంగనాయకులరెడ్డి, పోతు కొండారెడ్డి, గాయం బలరామిరెడ్డి, హుస్సేన్‌రెడ్డి, పెన్నా వెంకేటశ్వర్లు, బొట్టు శ్రీను, కాసుల గురవయ్యయాదవ్‌, సింగిల్‌విండో చైర్మన్‌ సూరసాని మోహన్‌రెడ్డి, సంగు సుబ్బారెడ్డి, కౌన్సిలర్‌ తమ్మినేని సుజాత,  ప్రముఖ వైద్యులు డాక్టర్‌ ధనుంజయడు, కె కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T06:15:08+05:30 IST