పనిచేసే వారికి గుర్తింపు

ABN , First Publish Date - 2022-06-27T04:42:01+05:30 IST

పనిచేసే నాయకులు, కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు ఉంటుందని వైసీపీ బాపట్ల పార్లమెంట్‌ ప్లీనరీ పరిశీలకుడు, కమ్యూనిటీ డెవలెప్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ నేదురుమల్లి రామ్‌కుమార్‌ రెడ్డి అన్నారు.

పనిచేసే వారికి గుర్తింపు
మాట్లాడుతున్న నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, వేదికపై శాప్‌నెట్‌ చైర్మన్‌ బాచిన కృష్ణచైతన్య తదితరులు

ప్రతి ఇంటికి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన ఘనత సీఎందే!

ప్లీనరీ పరిశీలకులు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి

అద్దంకి, జూన్‌ 26: పనిచేసే నాయకులు, కార్యకర్తలకు పార్టీలో  గుర్తింపు ఉంటుందని వైసీపీ బాపట్ల పార్లమెంట్‌ ప్లీనరీ పరిశీలకుడు, కమ్యూనిటీ డెవలెప్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ నేదురుమల్లి  రామ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ఆదివారం  స్థానిక శింగరకొండ రోడ్డులోని కూకట్ల కన్వె న్షన్‌లో జరిగిన అద్దంకి నియోజకవర్గ ప్లీనరీకి శాప్‌నెట్‌  చైర్మన్‌,  ని యోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రామ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామ సచివాల యాలు, వలంటీర్‌ వ్యవస్థలను ప్రవేశపెట్టి ప్రతి ఇంటి గడపకు ప్రభు త్వాన్ని తీసుకువచ్చిన ఘనత సీఎం జగన్మోహనరెడ్డికే దక్కుతుందన్నా రు. మీ ఉత్సాహానికి తగ్గట్లే జగన్మోహనరెడ్డి వచ్చే ఎన్నికలలో కృష్ణ చైతన్యను  అద్దంకి నుంచి పోటీచేయిస్తారని చెప్పారు. ఎమ్మెల్యేగా చేసే బాధ్యత మీ చేతుల్లోనే ఉందన్నారు. 

ఎంపీ  నందిగం సురేష్‌ మాట్లాడుతూ దుర్మార్గులందరూ కలిసి జగ న్‌పై యుద్ధానికి సిద్ధం అవుతున్నారన్నారు. కృష్ణచైతన్య మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలిచి  అద్దంకి నియోజకవర్గాన్ని సీఎంకు కానుకగా ఇచ్చేందుకు  కలసి కట్టుగా పనిచేయాలన్నారు. ప్రతి పక్షాలు చేస్తున్న  కుట్రలను, ఆరోపణలను వైసీపీ నాయకులు గట్టిగా తిప్పికొట్టాలన్నారు. టీడీపీకి భవిష్యత్‌లో ఉనికి కూడా ఉండదన్నారు. కొత్త, పాత నాయకులు అనే తేడా లేకుండా అందరు ఒక్కటే అన్న భావనతో కలసి పనిచేయాలన్నారు. కరోనాతో ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోయినా సంక్షేమం, అభివృద్ధిలో వెనుకంజ లేకుండా  సీఎం  కష్టపడుతున్నారన్నారు. 

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గరటయ్య, నియోజకవర్గ ప్లీనరీ పరిశీలకుడు కొల్లా వెంకటరావు, బాచిన చెంచు ప్రసాద్‌, జ్యోతి హను మంతరావు, కాకాని  రాధాకృష్ణమూర్తి, చింతల పేరయ్య, చింతా రామా రావు, శ్రీనివాసరెడ్డి, సాధినేని మస్తాన్‌రావు, అవిశన ప్రభాకరరెడ్డి, సందిరెడ్డి రమేష్‌, ఓరుగంటి కోటిరెడ్డి, అడవి శ్రీనివాసరావు, పూనూరి నరేంద్ర, భువనేశ్వరి, ఎస్తేరమ్మ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-27T04:42:01+05:30 IST