టీడీపీలోనే సామాన్య కార్యకర్తలకు గుర్తింపు

ABN , First Publish Date - 2022-05-23T07:04:18+05:30 IST

సమాన్య కార్యకర్తలకు గుర్తించి వారికి వారికి సమూచిత స్ధానం కల్పించే పార్టీ టీడీపీనే అని ప్రవాసాంధ్రుడు బొమ్మిశెట్టి బాలాజీ పేర్కొన్నారు.

టీడీపీలోనే సామాన్య కార్యకర్తలకు గుర్తింపు
పొదిలిలో బాదుడే బాదుడు నిర్వహిస్తున్న టీడీపీ నేతలు


పుల్లలచెరువు, మే 22: సమాన్య కార్యకర్తలకు గుర్తించి వారికి వారికి సమూచిత స్ధానం కల్పించే పార్టీ టీడీపీనే అని ప్రవాసాంధ్రుడు బొమ్మిశెట్టి బాలాజీ పేర్కొన్నారు. శనివారం అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన మహానాడులో ప్రవాసాంధ్రులు టీడీపీ పార్టీ విధివిధానాలపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా బోమ్మిశెట్టి బాలాజీ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న కార్యకర్తలను గుర్తిస్తారన్నారు. దీనికి తాను ఒక ఉదాహరణ చెప్పారు. తాను చదివిన  పాఠశాల ఉపాధ్యాయుడు ఒక దళితుడు. ఆయన  గత 20 ఏళ్లుగా, పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నాడు. అందుకు చంద్రబాబు గుర్తించి టీడీపీ ప్రభుత్వం అధికారంలో వున్నప్పుడు లిడ్‌క్యాప్‌ చైర్మన్‌గా, ప్రస్తుతం ఎర్రగొండపాలెం టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌గా ఎరిక్షన్‌బాబును నియమించి, ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాఽశం ఇచ్చారని పార్టీపై ప్రసంశల జల్లు కురిపించారు. ఎరిక్షన్‌బాబు లాంటి సామాన్యుడిని పార్టీ ఎంతో ఆదరిస్తోందని వై.పాలెం నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఎరిక్షన్‌బాబు ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు

పొదిలి: వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పధకాలను మరచి చార్జీలు, పన్నులు పెంచి బాదుడేబాదుడు పధకంతో ప్రజల నడ్డి విరుస్తోందని టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. పట్టణంలో ఆదివారం ఐదవ వార్డులో టీడీపీ నాయకులు ఇంటింటికీ తిరిగి పెరిగిన నిత్యావసర ధరలకు సంభందించి కరపత్రాలను పంచిపెట్టారు. అధికారంలోకి వచ్చేందుకు అనేక రకాల హామీలు ఇచ్చిన జగన్‌రెడ్డి తర్వాత అన్నివర్గాల ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ముల్లాఖుద్దూస్‌, మండలపార్టీ అధ్యక్షులు మీగ డ ఓబుల్‌రెడ్డి,రాష్ట్రకార్యదర్శి గునుపూడిభాస్కర్‌,  జిల్లా టిడిపి వాణిజ్యవిభాగం మాజీ అద్యక్షులు సామంతపూడి నాగేశ్వరరావు,  జిల్లా నాయ కులు డాక్టర్‌ ఇమాంసా, ఆవులూరి యలమంద, ఎస్‌ఎంబాషా,  యాసిన్‌,షాహిద్‌,  మాజీ సర్పంచ్‌ కాటూరి చిన్నబాబు, జిల్లా మహిళా నాయకురాలు షేక్‌ షహనాజ్‌బేగం,  మండల నాయకులు కాటూరి శ్రీను, ముని శ్రీనివాసులు, జ్యోతి మల్లిఖార్జున, ఠాగూర్‌, కల్‌నాయక్‌, సందానీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-23T07:04:18+05:30 IST