ఆ ఆనందమే శాశ్వతం!

ABN , First Publish Date - 2020-10-16T05:19:35+05:30 IST

చేస్తున్న ఉద్యోగాల గురించి, వ్యాపారాల గురించి, సంసారాల గురించి... ఇలా ఏ పని గురించైనా ఆందోళన లేకుండా ఉండాలంటే ఈ శ్లోకం భావాన్ని అవగాహన చేసుకోవాలి. అన్వయం చేసుకోవాలి. ఆచరణలో పెట్టాలి. భగవద్గీత నాలుగో అధ్యాయం ఇరవై రెండో శ్లోకంలో శ్రీకృష్ణపరమాత్మ ఇలా చెప్పాడు...

ఆ ఆనందమే శాశ్వతం!

చేస్తున్న ఉద్యోగాల గురించి, వ్యాపారాల గురించి, సంసారాల గురించి... ఇలా ఏ పని గురించైనా ఆందోళన లేకుండా ఉండాలంటే ఈ శ్లోకం భావాన్ని అవగాహన చేసుకోవాలి. అన్వయం చేసుకోవాలి. ఆచరణలో పెట్టాలి. భగవద్గీత నాలుగో అధ్యాయం ఇరవై రెండో శ్లోకంలో శ్రీకృష్ణపరమాత్మ ఇలా చెప్పాడు. 


  • యదృచ్ఛాలాభసంతుష్టో  ద్వంద్వాతీతో విమత్సరః
  • సమః సిద్ధా వసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే

‘‘యాదృచ్ఛికంగా, కాకతాళీయంగా జరిగే వాటిని పట్టించుకోవద్దు. యోగ మార్గంలో ఉన్న వారైతే అన్నీ యాదృచ్ఛికంగానే జరగనివ్వండి. పని కట్టుకుని మీరు ఏదీ చేయకండి’’ అని చెప్పాడు కృష్ణుడు. ఇది గొప్ప యోగం. ‘‘యదృచ్ఛాలాభసంతుష్టో’... అనుకోకుండా ఏదో వస్తువు వచ్చింది అనుకుందాం. దాన్ని ఉపయోగించుకో! పదార్థం అయితే తిను. తరువాత దాని గురించి ఆలోచించకు, వదిలేయ్‌! ఇంకా ఎక్కువ కావాలని అనుకోకు. దొరికిన దానితో సంతృప్తి పడు. జయానికి - అపజయానికి, రాగానికి - ద్వేషానికి, లాభానికి - నష్టానికి, దుఃఖానికి - సుఖానికి అతీతంగా ఉండు. యాదృచ్ఛికంగా దొరికిన దానికి సంతోషించు. అదనంగా ఆశించకు. ద్వేషానికీ, దుఃఖానికీ కారణం అసూయ. నువ్వు నోబెల్‌ బహుమతి పొందినా, ఆ సన్మానం జరిగేది ఐదు నిమిషాలే! కానీ ఆ స్థాయికి చేరడానికి నువ్వు చేసిన కృషిలో పొందే ఆనందమే ఎక్కువ. అది శాశ్వతం. అలా ఉండగలిగితే ఎలాంటి ఆందోళన మీ దరిచేరదు. 



- గరికిపాటి నరసింహారావు

Updated Date - 2020-10-16T05:19:35+05:30 IST