సమస్యలపై వినతుల స్వీకరణ

ABN , First Publish Date - 2021-01-19T05:27:17+05:30 IST

ఐటీడీఏ పరిధిలో గల వివిధ గిరిజన గ్రామాల ప్రజలు పలు సమస్యలపై ఐటీడీఏ పీవో ఆర్‌.కూర్మనాథ్‌ సోమవారం వినతులు స్వీకరించారు.

సమస్యలపై వినతుల స్వీకరణ

పార్వతీపురం, జనవరి 18: ఐటీడీఏ పరిధిలో గల వివిధ గిరిజన గ్రామాల ప్రజలు పలు సమస్యలపై ఐటీడీఏ పీవో ఆర్‌.కూర్మనాథ్‌ సోమవారం వినతులు స్వీకరించారు. బంటు వానివలస గ్రామానికి చెందిన మత్స్యకారులు చేపల చెరువు కోసం స్థలం ఇవ్వాలని కోరారు. పాచిపెంట, కురుపాం, సాలూరు, తదితర మం డలాలకు చెందిన వివిధ గ్రామాల గిరిజనులు వ్యక్తిగత రుణాలు, రహదారుల నిర్మా ణాలు, తదతర సమస్యలపై పీవోకు వినతిపత్రాలు సమ ర్పించగా సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకో వాలని ఆయా శాఖల అధికా రులను పీవో ఆదేశించారు.
అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి చర్యలు చేప ట్టాలని ఐటీడీఏ పీవో ఆర్‌.కూర్మనాథ్‌ అన్నారు. సోమవారం పీవో తన చాంబర్‌లో సబ్‌ప్లాన్‌ మండలాల్లోని ఎక్సైజ్‌శాఖ సూపరింటెండెంట్‌, సీఐ, ఎస్‌ఐలు, పోలీస్‌శాఖ సీఐలతో సమీక్ష నిర్వ హించారు.  ఈ సందర్భంగా పీవో మాట్లా డుతూ అక్రమ మద్యం రవాణాపై గిరిజన ప్రాం తాల ప్రజ లకు అవ గాహన కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. పార్వతీపురం ఎక్సైజ్‌ సీఐ అబ్దుల్‌ కలీమ్‌, కురుపాం సీఐ సతీష్‌ కుమార్‌, బై.భీమ్‌, పార్వతీపురం టౌన్‌ ఎస్‌ఐ కళాధర్‌, రూరల్‌ ఎస్‌ఐ వీరబాబు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-19T05:27:17+05:30 IST