కరోనా పుణ్యమాని భారతదేశంలో కూడా ఓటీటీలకు డిమాండ్ పెరిగింది. ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్లు చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. భాషాభేదం లేకుండా ఏ భాషలో మంచి కంటెంట్ ఉందంటే దానిని చూస్తున్నారు. ఓటీటీలకు పెరుగుతున్న ఆదరణను చూసి సినిమా దర్శక నిర్మాతలు కూడా వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కొన్ని సినిమాలను నేరుగా ఓటీటీల్లోనే విడుదల చేస్తున్నారు. వెబ్ సిరీస్లను రూపొందించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ ఓటీటీ ప్లాట్ఫామ్ల్లో ఆదివారం విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్ల వివరాలు మీకోసం..