ఉద్ధవ్ రాజీనామాపై శివసేన రెబల్ ఎమ్మెల్యే రియాక్షన్ ఇదీ.. సంజయ్ రౌత్‌తోపాటు ఎన్సీపీపై ఆగ్రహం

ABN , First Publish Date - 2022-06-30T15:03:42+05:30 IST

గత కొన్ని రోజులుగా సాగుతూ వస్తున్న మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ముగింపు దిశకు చేరుకుంది. బలపరీక్షకు సిద్ధం అవ్వాలంటూ గవర్నర్ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించడంతో.. ము

ఉద్ధవ్ రాజీనామాపై శివసేన రెబల్ ఎమ్మెల్యే రియాక్షన్ ఇదీ.. సంజయ్ రౌత్‌తోపాటు ఎన్సీపీపై ఆగ్రహం

ఇంటర్నెట్ డెస్క్: గత కొన్ని రోజులుగా సాగుతూ వస్తున్న మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ముగింపు దిశకు చేరుకుంది. బలపరీక్షకు సిద్ధం అవ్వాలంటూ గవర్నర్ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించడంతో.. ముఖ్యమంత్రి పదవితోపాటు ఎమ్మెల్సీ పదవికి శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. బుధవారం రాత్రి గవర్నర్‌ను కలిసి.. ఆయన తన రాజీనామా లేఖను అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ రాజీనామాపై శివసేన రెబల్ ఎమ్మెల్యే దీపక్ కేసర్‌ఖర్ స్పందించారు.


జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్‌ఠాక్రే రాజీనామా తమకు సంతోషాన్ని ఇవ్వడం లేదని పేర్కొన్నారు. తాము లేవనెత్తిన అంశాన్ని ఠాక్రే సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్సీపీ, సంజయ్ రౌత్ ప్రతి రోజూ పనిగట్టుకుని కామెంట్లు చేసినట్టు తెలిపారు. దీంతో కేంద్ర, ప్రభుత్వల మధ్య సంబంధాలు చెడిపోయినట్టు పేర్కొన్నారు. ఆ కామెంట్లే తమలోని అసంతృప్తికి కారణమయ్యాయని స్పష్టం చేశారు. అంతేకాకుండా సంజయ్ రౌత్ జోక్యం కూడా ఎక్కువ కావడంతో భరించలేకపోయినట్టు చెప్పారు. మహా వికాస్ అఘాఢీ కూటమి నుంచి వైదొలగి.. బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే డిమాండ్ చేసినట్టు వెల్లడించారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌పై పోరాడుతున్న క్రమంలో.. ఉద్ధవ్‌పై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చెప్పారు. ఉద్ధవ్‌పై కోపం తెచ్చుకున్నందుకు తామంతా బాధపడినట్టు వివరించారు. 



ఇదిలా ఉంటే.. రెబల్ ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్న ఏక్‌నాథ్ షిండే.. బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్‌తో జత కట్టనున్నారు. జూలై 1న మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్.. ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధం అవుతున్నారని సమాచారం. ఈ క్రమంలో ఏక్‌నాథ్ షిండేకు డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు సహా, రెబల్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. కాగా.. నలభై మంది శివ సేన ఎమ్మెల్యేలు పది మంది ఇతరులు.. మొత్తంగా 50 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఏక్‌నాథ్ షిండేకు ఉంది. 


Updated Date - 2022-06-30T15:03:42+05:30 IST