America నుంచి భారత్‌కు పదేళ్ల తర్వాత విమాన సర్వీసుల పునరుద్ధరణ చేయడం వెనుక అసలు కారణాలు ఇవీ..!

ABN , First Publish Date - 2021-11-17T00:49:53+05:30 IST

అమెరికన్ ఎయిర్ లైన్స్.. ప్రయాణికుల సంఖ్యా పరంగా చూస్తే ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ లైన్స్ ఇది. ఇంతటి ప్రముఖ విమానయాన సంస్థ దశాబ్దం క్రితం ఫుల్‌స్టాప్ పెట్టిన సేవలను ఇటీవలే మళ్లీ ప్రారంభించింది. గత శనివారమే తొలి విమానం న్యూయార్క్‌లో బయలు దేరి న్యూఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. దీంతో.. సేవల పునరుద్ధరణ వెనక గల కారణాలు ఏంటా అనే చర్చ ప్రస్తుతం విస్తృతంగా జరుగుతోంది.

America నుంచి భారత్‌కు పదేళ్ల తర్వాత విమాన సర్వీసుల పునరుద్ధరణ చేయడం వెనుక అసలు కారణాలు ఇవీ..!

ఇంటర్నెట్ డెస్క్: అమెరికన్ ఎయిర్ లైన్స్.. ప్రయాణికుల సంఖ్యా పరంగా చూస్తే ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ లైన్స్ ఇది. ఇంతటి ప్రముఖ విమానయాన సంస్థ దశాబ్దం క్రితం ఫుల్‌స్టాప్ పెట్టిన సేవలను ఇటీవలే మళ్లీ ప్రారంభించింది. గత శనివారమే తొలి విమానం న్యూయార్క్‌లో బయలుదేరి న్యూఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. దీంతో.. సేవల పునరుద్ధరణ వెనక గల కారణాలు ఏంటా అనే చర్చ ప్రస్తుతం విస్తృతంగా జరుగుతోంది. 


ఇన్నాళ్లకు మళ్లీ సేవలు ప్రారంభించేందుకు అమెరికన్ ఎయిర్‌లైన్స్ సిద్ధమైందంటే ఈ మార్గంలో డిమాండ్ పెరుగుతోందనడానికి ఇది సంకేతమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా ఆంక్షలు తొలగిపోతున్న నేపథ్యంలో సేవలకు మరింతగా డిమాండ్ పెరగనుంది. భవిష్యత్తులో విమాన ప్రయాణాలు మరింత పెరగనున్నాయని అమెరికన్ ఎయిర్ లైన్స్ అంతర్జాతీయ రెగ్యులేటరీ వ్యవహారాల విభాగం ఉపాధ్యక్షుడు మైక్ విల్కిస్సన్ తాజాగా పేర్కొన్నారు. ఇక  అమెరికన్ ఎయిర్ లైన్స్ త్వరలో సియాటిల్,బెంగళూరు మధ్య కూడా విమాన సర్వీసు ప్రారంభించనుంది. 


ప్రస్తుతం అమెరికన్ ఎయిర్‌లైన్సే కాకుండా.. వివిధ విమాన సంస్థలు భారత్-అమెరికా మధ్య  ఫ్లైట్ సర్వీసులు అందిస్తున్నాయి. ఎయిర్ ఇండియా ద్వారా ఇక్కడి నుంచి నేరుగా అమెరికాలోని న్యూయార్క్, షికాగో, శాన్‌ఫ్రాన్‌సిస్కో,  వాషింగ్టన్ డీసీ నగరాలకు వెళ్లొచ్చు. మరోవైపు.. యూనైటెడ్ ఎయిర్‌లైన్స్  నెవార్క్-శాన్‌ఫ్రాన్సిస్కో విమాన సర్వీసు నిర్వహిస్తోంది. అయితే.. 2019లో అమెరికా-భారత్ మధ్య ఫ్లైట్ సర్వీస్ ప్రారంభించిన డెల్టా ఎయిర్ లైన్స్ 2020లో కరోనా కారణంగా ఈ సర్వీసును రద్దు చేసింది. మళ్లీ ఎప్పుడు తన సేవలు ప్రారంభిస్తుందనేది ఇకా తెలియరాలేదు. 


భారత్ నుంచి నేరుగా అమెరికాకు వెళ్లే నాన్‌స్టాప్ సర్వీసుకు భవిష్యత్తులో డిమాండ్ పెరుగుతుందని విమాన సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటివరకూ నానాస్టాప్ సర్వీసులే కాకుండా.. అనేక మంది దుబాయ్, అబుదాబీ, దోహా వంటి నగరాల మీదుగా కనెక్టింగ్ విమానాల ద్వారా అమెరికాకు వెళుతుంటారు. అయితే.. కరోనా నేపథ్యంలో నాన్‌స్టాప్ డైరెక్ట్ సర్వీసులకే డిమాండ్ ఉంటుందనే అంచనా వైమానిక రంగ నిపుణుల్లో నెలకొంది. 

Updated Date - 2021-11-17T00:49:53+05:30 IST