Jun 6 2021 @ 09:09AM

నితిన్ సినిమా వెనక్కి వెళ్లడానికి రీజన్ అదేనా?

హీరో నితిన్ ఇప్పుడు ‘మాస్ట్రో’ సినిమాను పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు. దీని తర్వాత వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కత్వంలో సినిమా చేస్తాడంటూ టాక్ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అయితే ఇంతకు ముందు కృష్ణ‌చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో ‘ప‌వ‌ర్ పేట’ అనే చిత్రంలో నితిన్ న‌టించ‌నున్నాడంటూ వార్త‌లు వినిపించాయి. అయితే ఈ హీరో ‘ప‌వ‌ర్ పేట‌’ను ప‌క్క‌న పెట్టి, వ‌క్కంతం సినిమాను లైన్‌లో తేవ‌డానికి కార‌ణం, మరో సినిమా స్టోరీ లైన్ అని టాక్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. వివరాల్లోకెళ్తే..  ప్ర‌స్తుతం శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ కాంబినేష‌న్‌లో అజ‌య్ భూప‌తి తెర‌కెక్కిస్తోన్న ‘మ‌హా స‌ముద్రం’ సినిమా క‌థ‌కు, కృష్ణ చైతన్య ‘ప‌వ‌ర్ పేట’ క‌థ‌కు ద‌గ్గ‌ర పోలిక‌లున్నాయ‌ని భావించిన నితిన్‌.. ఆ సినిమాను వెన‌క్కి నెట్టి... వ‌క్కంతం సినిమాను ట్రాక్ ఎక్కించే ప‌నిలో ఉన్నాడంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి.