హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మిర్చి రైతులకు ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలని, మిగతా పంటలకు ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలని లేఖలో డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేయాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో దాదాపు 25 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు. ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చిన నిధులను ఏం చేశారు? అని రేవంత్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకోకపోతే.. రైతుల కోసం ప్రత్యక్ష కార్యాచరణ చేపడుతామని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి