భార్యాపిల్లల ఎదుటే...

ABN , First Publish Date - 2022-09-18T17:14:25+05:30 IST

రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌ను భార్యాపిల్లల ఎదుటే దారుణంగా హతమార్చిన సంఘటన బెళగావిలో చోటు చేసుకుంది. బెళగావిలోని క్యాంప్‌

భార్యాపిల్లల ఎదుటే...

                                     - రియల్టర్‌ దారుణ హత్య  


బెంగళూరు, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌ను భార్యాపిల్లల ఎదుటే దారుణంగా హతమార్చిన సంఘటన బెళగావిలో చోటు చేసుకుంది. బెళగావిలోని క్యాంప్‌ ప్రాంతంలో శుక్రవారం రాత్రి సుధీర్‌ కాంబళె (57)ను ప్రత్యర్థులు హతమార్చారు. రాత్రి ఇంట్లోకి ప్రవేశించిన వారు సుధీర్‌(Sudhir Kambale)పై విచక్షణా రహితంగా మారణాయుధాలతో దాడి చేశారు. కొన్నేళ్లుగా దుబాయ్‌లో నివసిస్తున్న సుధీర్‌ కొవిడ్‌ తర్వాత సొంతూరు బెళగావికి వెనుతిరిగాడు. క్యాంప్‌లో కుటుంబ సభ్యులతోపాటు ఉన్నారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఘటనా స్థలాన్ని క్యాంప్‌ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. 

Updated Date - 2022-09-18T17:14:25+05:30 IST