108 ఎంపి కెమెరాతో రియల్‌మి

ABN , First Publish Date - 2021-03-06T06:14:28+05:30 IST

108ఎంపి కెమెరాతో స్మార్ట్‌ ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు రియల్‌మి సన్నద్దమవుతోంది. కెమెరా ఇన్నోవేషన్‌ ఈవెంట్‌లో భాగంగా 108 ఎంపి కెమెరా సెన్సర్‌ను రియల్‌మి 8 సిరీస్‌లో ప్రదర్శించనుంది. శాంసంగ్‌కు చెందిన 108 ఎంపి సెన్సర్‌ హెచ్‌ఎం2ని ప్రైమరీ

108 ఎంపి కెమెరాతో రియల్‌మి

108ఎంపి కెమెరాతో స్మార్ట్‌ ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు రియల్‌మి సన్నద్దమవుతోంది. కెమెరా ఇన్నోవేషన్‌ ఈవెంట్‌లో భాగంగా 108 ఎంపి కెమెరా సెన్సర్‌ను రియల్‌మి 8 సిరీస్‌లో ప్రదర్శించనుంది. శాంసంగ్‌కు చెందిన 108 ఎంపి సెన్సర్‌ హెచ్‌ఎం2ని ప్రైమరీ కెమెరాగా అమర్చనుంది. 12000 ఇంటూ 9000 పిక్సల్‌ ఫొటో తీసుకోవచ్చు. 9-ఇన్‌-1 పిక్సల్‌ బిన్నింగ్‌, ఐసోసెల్‌ ప్లస్‌, స్మార్ట్‌-ఐఎస్‌ఒను ఈ సెన్సర్‌ సపోర్ట్‌ చేస్తుంది. జూమ్‌ సామర్థ్యం మూడు రెట్లు ఉంటుంది. స్టారే టైమ్‌ లాప్స్‌ వీడియోను ఇవ్వనుంది. ప్రపంచంలో మొదట తామే ఈ ఫీచర్‌ అందిస్తున్నట్టు రియల్‌మి ప్రకటించింది. 30 ఫొటోలను షూట్‌ చేసి ఫస్ట్‌ టైమ్‌ లాప్స్‌ వీడియోను  అందించేందుకు 480 సెకన్లు అంటే ఎనిమిది నిమిషాలు పడుతుంది. అదేమాదిరిగా ప్రపంచంలోనే మొదటిసారి టిల్ట్‌ షిప్ట్‌ టైమ్‌ లాప్స్‌ వీడియో సపోర్ట్‌ కూడా ఇవ్వనుంది. రియల్‌మి 8 సిరీస్‌ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే విషయం మాత్రం అధికారికంగా వెల్లడి కాలేదు. 

Updated Date - 2021-03-06T06:14:28+05:30 IST