‘బిఐఎ్‌స’తో రియల్‌మి బ్యాండ్‌ 2

ABN , First Publish Date - 2021-08-21T08:14:05+05:30 IST

తన స్మార్ట్‌ వేరబుల్స్‌తో భారత మార్కెట్లో తన బ్రాండ్‌ను విస్తరించుకునే పనిలో

‘బిఐఎ్‌స’తో రియల్‌మి బ్యాండ్‌ 2

తన స్మార్ట్‌ వేరబుల్స్‌తో భారత మార్కెట్లో తన బ్రాండ్‌ను విస్తరించుకునే పనిలో రియల్‌ మి ఉంది.  కంపెనీకి చెందిన స్మార్ట్‌ బ్యాండ్‌ ‘రియల్‌మి బ్యాండ్‌ 2’  ‘బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌’(బిఐఎస్‌) వెబ్‌సైట్‌లో కనిపించింది. 


స్మార్ట్‌ బ్యాండ్‌ కేటగిరిలో ఈ బ్యాండ్‌ను గత ఏడాదే రియల్‌మి విడుదల చేసింది. ఈ ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ 0.96 - ఇంచ్‌ల టిఎ్‌ఫటి లెడ్‌ స్ర్కీన్‌కు తోడు ఇతర ఫీచర్లు అంటే హార్ట్‌ రేట్‌ సెన్సర్‌, స్లీప్‌ రేట్‌ మానిటరింగ్‌,  ఐడిల్‌ అలర్ట్‌ వంటివి ఉన్నాయి. మోడల్‌ నంబర్‌ ఆర్‌ఎండబ్ల్యు2010 కాగా చెప్పుకోదగ్గ వివరాలు ఏవీ వెల్లడి కాలేదు. వైర్‌లెస్‌ కనెక్టివిటీ కోసం 5.2 వెర్షన్‌తో బ్లూటూత్‌ ఉండొచ్చునని భావిస్తున్నారు. పాతదానితో పోల్చుకుంటే కంపెనీ తాజాగా విడుదల చేయబోయే దీని స్ర్కీన్‌ పెద్దగా ఉంటుందని వార్తలు వచ్చాయి. 1.4 ఇంచీల టచ్‌ డిస్‌ప్లే కావచ్చు. 


Updated Date - 2021-08-21T08:14:05+05:30 IST