స్మార్ట్‌ఫోన్ల చరిత్రలోనే తొలిసారి.. 150 వాట్స్ చార్జింగ్ సపోర్ట్‌తో ‘రియల్‌మి జీటీ నియో 3’

ABN , First Publish Date - 2022-03-22T21:49:35+05:30 IST

చైనా మొబైల్ మేకర్ రియల్‌మి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ‘జీటీ నియో3’ పేరుతో

స్మార్ట్‌ఫోన్ల చరిత్రలోనే తొలిసారి.. 150 వాట్స్ చార్జింగ్ సపోర్ట్‌తో ‘రియల్‌మి జీటీ నియో 3’

న్యూఢిల్లీ: చైనా మొబైల్ మేకర్ రియల్‌మి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ‘జీటీ నియో3’ పేరుతో భారత్‌లో లాంచ్ చేసిన ఈ ఫోన్‌లో పలు ప్రత్యకతలున్నాయి. 120 హెర్జ్ రీఫ్రెష్ రేట్, మీడియా టెక్ డైమెన్సిటీ 8100 5జీ ఎస్ఓసీ, రెండు వేర్వేరు బ్యాటరీ సామర్థ్యాలు.. అంటే 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ 150 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ 80 వాట్స్ చార్జింగ్  సపోర్ట్‌తో అందుబాటులో ఉన్నాయి. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ వంటివి ఉన్న ఇందులో 50 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనకవైపు మూడు కెమెరాలు, డాల్బీ అట్మోస్ స్పీకర్లు, 150 వాట్స్ అల్ట్రాడార్ట్ చార్జింగ్ టెక్నాలజీ వంటివి ఉన్నాయి.


రియమ్‌మి జీటీ నియో 3 6జీబీ ర్యామ్+128 జీబీ వేరియంట్ ధర దాదాపు రూ. 24 వేలు కాగా, 8జీబీ+256జీబీ కన్ఫిగరేషన్ ఫోన్ ధర దాదాపు రూ.27,500. 12జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజీ మోడల్ వేరియంట్ ధర దాదాపు రూ.31,200గా ఉంది. రియల్‌మి జీటీ నియో 3.. 150 వాట్స్ వేరియంట్ 8జీబీ+256 జీబీ వేరియంట్  ధర దాదాపు రూ. 31,200 కాగా, 12జీబీ +256 జీబీ మోడల్  ధర దాదాపు రూ. 33,600.  


రియల్‌మి జీటీ  నియో 3 స్పెసిఫికేషన్లు: ఆండ్రాయిడ్ 11 ఓఎస్, 6.7 అంగుళాల 2కె డిస్‌ప్లే, మీడియా టెక్ 8,100 5జి ఎస్ఓసీ, 50 ఎంపీ  ప్రధాన సెన్సార్‌తో వెనకవైపు మూడు కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 150 వాట్స్ చార్జింగ్‌ సపోర్ట్‌తో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్స్ చార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ. 

Updated Date - 2022-03-22T21:49:35+05:30 IST