లాంచింగ్‌కు ముందే లీకైన ‘రియల్‌మి సి11’ ధర!

ABN , First Publish Date - 2020-06-30T03:20:24+05:30 IST

రియల్‌మి ఈ నెల 30న (మంగళవారం) మలేసియాలో ‘రియల్‌మి సి11’ స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేయబోతోంది.

లాంచింగ్‌కు ముందే లీకైన ‘రియల్‌మి సి11’ ధర!

న్యూఢిల్లీ: రియల్‌మి ఈ నెల 30న (మంగళవారం) మలేసియాలో ‘రియల్‌మి సి11’ స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేయబోతోంది. అయితే, లాంచింగ్‌కు ముందే దాని ధర ఆన్‌లైన్‌లో లీకైంది. రియల్‌మి సి11 2జీబీ ర్యామ్, 32జీబీ వేరియంట్ ధర భారత కరెన్సీలో 9,590 రూపాయలు ఉండే అవకాశం ఉంది. 3జీబీ ర్యామ్, 32 జీబీ వేరియంట్ ధర రూ.10,120. మింట్ గ్రీన్, పెప్పర్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంది. 


రియల్‌మి సి11 స్పెసిఫికేషన్లు: 6.5 అంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 10 ఓఎస్, ప్రపంచంలోనే తొలిసారిగా మీడియా టెక్ హెలియో జి35 గేమింగ్ ప్రాసెసర్, 13 ఎంపీ+2ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, డ్యూడ్రాప్ నాచ్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటివి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. 


Updated Date - 2020-06-30T03:20:24+05:30 IST