5000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాడ్ రియర్ కెమెరా.. వచ్చేసిన రియల్‌మి 7ఐ

ABN , First Publish Date - 2020-09-18T01:40:54+05:30 IST

రియల్‌మి 7ఐ ఇండోనేషియాలో లాంచ్ అయింది. రియల్‌మి 7తోపాటు ఇది లాంచ్ అయింది. స్లిమ్ బేజెల్స్, హోల్‌పంచ్ కట్ అవుట్

5000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాడ్ రియర్ కెమెరా.. వచ్చేసిన రియల్‌మి 7ఐ

న్యూఢిల్లీ: రియల్‌మి 7ఐ ఇండోనేషియాలో లాంచ్ అయింది. రియల్‌మి 7తోపాటు ఇది లాంచ్ అయింది. స్లిమ్ బేజెల్స్, హోల్‌పంచ్ కట్ అవుట్ సెల్పీ కెమెరా, వెనకవైపు నాలుగు కెమెరాలు వంటివి ఉన్నాయి. ఆక్టాకోర్ సీపీయూను ఉపయోగించిన ఈ ఫోన్ ఒకే ఒక్క వేరియంట్‌లో అందుబాటులో ఉంది.


8జీబీ ర్యామ్+128 జీబీ వేరియంట్ ధర భారత కరెన్సీలో దాదాపు రూ. 15,800 మాత్రమే.  ఈ నెల 18న ఇండోనేషియాలో రియల్‌మి అధికారిక వెబ్‌సైట్, లాజడా, అకులకు డాట్ కామ్‌లలో తొలి సేల్ ప్రారంభం కానుంది. 19 నుంచి ఇండోనేషియాలో ఓపెన్‌ సేల్‌ ప్రారంభం కానుంది. అయితే, అంతర్జాతీయ మార్కెట్లోకి ఎప్పుడు వచ్చేది మాత్రం తెలియరాలేదు.  


రియల్‌మి 7ఐ స్పెసిఫికేషన్లు: ఆండ్రాయిడ్ 10 ఓఎస్, 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 662 ఎస్ఓసీ, 8జీబీ ర్యామ్, 128జీబీ అంతర్గత మెమొరీ, ఎల్ ఆకారంలో 64 ఎంపీ ప్రధాన సెన్సార్‌లో వెనకవైపు నాలుగు కెమెరాలు, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటివి ఉన్నాయి. 


Updated Date - 2020-09-18T01:40:54+05:30 IST