రియల్‌మి 6ఐ లాంచింగ్ ఎప్పుడో తెలిసిపోయింది!

ABN , First Publish Date - 2020-07-11T23:58:43+05:30 IST

రియల్‌మి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘రియల్‌మి 6ఐ’ లాంచిగ్ ఎప్పుడో తెలిసిపోయింది. ‘రియల్‌మి

రియల్‌మి 6ఐ లాంచింగ్ ఎప్పుడో తెలిసిపోయింది!

న్యూఢిల్లీ: రియల్‌మి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘రియల్‌మి 6ఐ’ లాంచిగ్ ఎప్పుడో తెలిసిపోయింది. ‘రియల్‌మి సి11’తో పాటు ఈ నెల 14న విడుదల కాబోతోంది. అయితే ఈ ఫోన్‌కు సంబంధించి రియల్‌మి ఎటువంటి వివరాలను బయటపెట్టలేదు. అయితే, ఫ్లిప్‌కార్ట్ మాత్రం తన యాప్‌లో లాంచింగ్ వివరాలను వెల్లడించింది. రియల్‌మి 6ఐ రూ. 15 వేల లోపు ధర సెగ్మెంట్‌లో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మే నెలలో యూరప్‌లో విడుదల చేసిన ‘రియల్‌మి 6ఎస్’కు ఇది రీబ్రాండెడ్ వెర్షన్ అని తెలుస్తోంది. మరోవైపు, రియల్‌మి 6ఐ మోడల్ ఈ ఏడాది మార్చిలోనే మయన్మార్‌లో అందుబాటులోకి వచ్చింది. రియల్‌మి 6ఐకి సంబంధించిన ఫొటోను ఫ్లిప్‌కార్ట్ తన మొబైల్ యాప్‌లో పోస్టు చేసింది.

 

బయటకొచ్చిన లీకులను బట్టి రియల్‌మి 6ఐలో మీడియా టెక్ హెలియో జి90టి ప్రాసెసర్ వాడినట్టు తెలుస్తోంది. హోల్ పంచ్ డిస్‌ప్లే, వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నట్టు సమాచారం. యూరప్‌లో విడుదల చేసిన రియల్‌మి 6ఎస్‌ ధర దాదాపు రూ. 16,900 ఉండే అవకాశం ఉంది. 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్ హోల్‌పంచ్ డిస్‌ప్లే, మీడియా టెక్ హెలియో జి90టి ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64 అంతర్గత మెమొరీ, 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ వంటివి ఉన్నాయి.   


Updated Date - 2020-07-11T23:58:43+05:30 IST