కోటీశ్వరుడి భార్య.. తనకంటే 13 ఏళ్లు చిన్నోడైన ఆటోడ్రైవర్‌తో ప్రేమాయణం.. ఇద్దరూ కలిసి ఇచ్చిన షాక్‌తో ఆ భర్తకు మైండ్‌బ్లాక్..!

ABN , First Publish Date - 2021-10-27T01:26:32+05:30 IST

ఓ కోటీశ్వరుడికి అతడి భార్య ఊహించని షాకిచ్చింది. ఆమె.. తన కంటే పదమూడేళ్లు చిన్న వాడైన ఓ ఆటో డ్రైవర్‌తో ప్రేమలో పడి చివరికి ఇల్లు విడిచి వెళ్లిపోయింది.

కోటీశ్వరుడి భార్య.. తనకంటే 13 ఏళ్లు చిన్నోడైన ఆటోడ్రైవర్‌తో ప్రేమాయణం.. ఇద్దరూ కలిసి ఇచ్చిన షాక్‌తో ఆ భర్తకు మైండ్‌బ్లాక్..!

ఇంటర్నెట్ డెస్క్: ఓ కోటీశ్వరుడికి అతడి భార్య ఊహించని షాకిచ్చింది. ఆమె.. తన కంటే పదమూడేళ్లు చిన్న వాడైన ఓ ఆటో డ్రైవర్‌తో ప్రేమలో పడి చివరికి ఇల్లు విడిచి వెళ్లిపోయింది. పోతూ పోతూ భర్త ఇంట్లో దాచిన రూ.43 లక్షలను కూడా తీసుకెళ్లిపోయింది. వాళ్లిద్దరూ చేసిన పనికి దిమ్మతిరిగిపోయిన ఆ కోటీశ్వరుడు తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో ఇటీవల జరిగిందీ ఘటన.


బాధితుడు పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి. కోట్ల ఆస్తులు ఉన్నాయి..అత్యంత విలాసవంతమైన జీవితం. కొంత కాలం క్రితం ఇమ్రాన్ అనే ఆటో డ్రైవర్‌పై అతడి భార్య మనసు పారేసుకుంది. ఈ క్రమంలో శుక్రవారం నాడు ఆమె అతడిని తీసుకుని ఇంట్లోంచి పారిపోయింది. భార్య తీసుకున్న నిర్ణయంతో వ్యాపారికి ఊహించని షాక్ తగిలింది. మరోవైపు.. ఇంట్లో ఉండాల్సిన రూ.47 లక్షలు కూడా కనిపించలేదు. దీంతో.. అతడికి కాలికింద భూమి కదిలిపోతున్నట్టు అనిపించింది. ఆ డబ్బంతా తీసుకుని భార్య ప్రియుడితో పరారైపోయి ఉంటుందని నిర్ధారించుకున్న అతడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య కొంత కాలంగా ఇమ్రాన్‌తో సన్నిహితంగా ఉంటోందన్న విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్లాడు. 


దీంతో.. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రస్తుతం వారిద్దరి కోసం వివిధ నగరాల్లో గాలిస్తున్నారు. అయితే..అతడు పోగొట్టుకున్న సొమ్ములోంచి రూ. 37 లక్షలను తిరిగి రాబట్టామని వారు తాజాగా పేర్కొన్నారు. ఆ డబ్బును ఇమ్రాన్ తన స్నేహితుల వద్ద దాచిపెట్టాడని తెలిపారు. ప్రస్తుతం పోలీసులు రియాల్టర్ భార్య, ఆమె ప్రేమికుడి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.  

Updated Date - 2021-10-27T01:26:32+05:30 IST