రియల్‌ హీరోలు

ABN , First Publish Date - 2021-05-12T07:20:31+05:30 IST

కరోనా కరాళనృత్యం చేస్తోంది. వందల మంది ఈ మహమ్మారి బారిన పడు తున్నారు. పలువురు ప్రాణాలు కోల్పో తు న్నారు.

రియల్‌ హీరోలు
కరోనా పరీక్షలను పరిశీలిస్తున్న ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు

కనిగిరి, మే 11 : కరోనా కరాళనృత్యం చేస్తోంది. వందల మంది ఈ మహమ్మారి బారిన పడు తున్నారు. పలువురు ప్రాణాలు కోల్పో తు న్నారు. దీంతో ఈ మహమ్మారి అంటేనే జనం వణికిపోతున్నారు. ఎక్కడైనా కేసు వచ్చిం దంటే ఆవైపు వెళ్లేందుకు కూడా జంకుతు న్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణా లను సైతం లెక్క చేయకుండా వైద్య, పారి శుధ్యం సిబ్బంది ప్రజాసేవకు అంకిత మ య్యారు. రక్షణ సామగ్రి లేకపోయినా కని పించని శత్రువుతో యుద్ధం చేస్తున్నారు. అలు పెరుగని సైనికుల్లా పని చేస్తున్నారు. కరోనా అనుమానితులకు పరీక్షలు నిర్వహిం చడం, గ్రా మాల్లో ప్రతి ఇంటినీ సందర్శించి బాధి తులను గుర్తించడం, వారిని చైతన్యం చేయడం వంటి కార్య క్రమాలను ఏఎన్‌ఎంల, ఆశా కార్య కర్తలు నిర్వహిస్తున్నారు. అలాగే పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివి. కానీ వారి సంక్షేమం మాత్రం గాలిలో దీపంలా ఉంది.

దిన దిన గండమే

ప్రస్తుత పరిస్థితిల్లో ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు ప్రతి ఇంటిని సందర్శిం చాలన్నా, కరోనా బాధితులకు వైద్య సేవలందించాలన్నా తప్పనిసరిగా రక్షణ అవ సరం. అయితే వారి ఆరోగ్య భద్రత గురించి అధికారులు పట్టించుకోవడం లేదు. గ్లౌజ్‌లు, మాస్క్‌లు, పీపీఈ కిట్‌లు, ప్రతిరోజూ అం దించాల్సి ఉండగా వాటి ఊసే కరువైంది. అవి లేకుండానే చాలాచోట్ల కరోనా టెస్టుల కోసం శ్వాబ్‌ను సేకరిస్తున్నారు. పరీక్షలు నిర్వహించిన తర్వాత కరోనా శాతం పరీ క్షించే వ్యక్తికి కూడా రక్షణ సామగ్రి కరు వైంది. అయినప్పటికీ వారు ప్రజా సేవకు అంకితమై పని చేస్తుండటం అభి నంద నీయం. 

పారిశుధ్య కార్మికులకు 

రక్షణ చర్యలు కరువు 

పారిశుధ్య కార్మికులు కూడా ఎలాంటి రక్షణ చర్యలు లేకుండానే విధులు నిర్వహిస్తున్నారు. గ్లౌజ్‌లు, మాస్కులు అటుంచి కనీసం వారికి స బ్బులు కూడా ఇస్తున్న పాపాన లేదు. దీంతో విఽధులు నిర్వహించిన అనంతరం ఇళ్లకు వె ళ్లాలంటే భయంగా ఉందని వారు ఆవేదన చెం దుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయి సిబ్బంది ఆరోగ్యంపై దృష్టి సారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. 

Updated Date - 2021-05-12T07:20:31+05:30 IST