Viral Video: ఈ వీడియో చూశాక హృదయం ద్రవించకుండా ఉంటుందా?

ABN , First Publish Date - 2022-07-22T01:47:36+05:30 IST

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోల్లో కొన్ని ఔరా అనిపిస్తే, మరికొన్ని నవ్వు తెప్పిస్తుంటాయి. ఇంకొ

Viral Video: ఈ వీడియో చూశాక హృదయం ద్రవించకుండా ఉంటుందా?

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోల్లో కొన్ని ఔరా అనిపిస్తే, మరికొన్ని నవ్వు తెప్పిస్తుంటాయి. ఇంకొన్ని ఆలోచింపజేస్తే.. మరికొన్ని స్ఫూర్తి నింపుతాయి. ఈ వీడియో మాత్రం హృదయాలను పిండేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్న ఈ వీడియో మెక్సికోకి సంబంధించినది. 


16 ఏళ్ల టీనేజ్ ఫుట్‌బాల్ ఆటగాడు హత్యకు గురయ్యాడు. విషయం తెలిసిన అతడి స్నేహితులు, టీమ్మేట్స్ జీర్ణించుకోలేకపోయారు. అతడితో తాము ఆడిన గేమ్స్‌ను, గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. అతడు ప్రతి రోజు ఎక్కడైతే ఫుట్‌బాల్ ఆడేవాడో.. అతడి శవపేటికను అక్కడకు తీసుకొచ్చారు. గ్రౌండ్ మధ్యలో దానిని ఉంచి ‘స్నేహితుడి’తో కలిసి ఫుట్‌బాల్ ఆడారు. ఓ ఆటగాడు బంతిని శవపేటిక వైపు కొట్టగా అది దానిని తాకి గోల్‌లోకి వెళ్లింది. గోల్‌కీపర్ దానిని అడ్డుకోలేకపోయాడు. అంతే.. స్నేహితుడే గోల్ చేసినంత ఆనందంగా అందరూ శవపేటికను వాటేసుకున్నారు. ఇది చూసినవారు కళ్లవెంట కన్నీళ్లు జలజలా రాలాయి. స్నేహితుడితో చివరి గోల్ అతడిని ఆనందంగా సాగనంపారు. ఈ వీడియో దాదాపు 7 మిలియన్ల వీక్షణలకు చేరువైంది. 6,900 సార్లు రీట్వీట్ అయింది. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోతున్నామంటూ కామెంట్లు వందలాదిగా వెల్లువెత్తుతున్నాయి.



Updated Date - 2022-07-22T01:47:36+05:30 IST