ప్రవాసులకు పోస్టల్‌ బ్యాలెట్‌ కల్పించాలి.. కేంద్ర ప్రభుత్వానికి ఈసీ ప్రతిపాదన

ABN , First Publish Date - 2020-12-02T08:56:03+05:30 IST

ప్రవాస భారతీయులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. సర్వీసు ఓటర్ల విషయంలో పోస్టల్‌ బ్యాలెట్‌ పద్ధతి విజయవంతంగా కొనసాగుతోందని, ఈ సేవలను ప్రవాస భారతీయులకు పొడిగించవచ్చని ఈసీ పేర్కొంది.

ప్రవాసులకు పోస్టల్‌ బ్యాలెట్‌ కల్పించాలి.. కేంద్ర ప్రభుత్వానికి ఈసీ ప్రతిపాదన

న్యూఢిల్లీ, డిసెంబరు 1: ప్రవాస భారతీయులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. సర్వీసు ఓటర్ల విషయంలో పోస్టల్‌ బ్యాలెట్‌ పద్ధతి విజయవంతంగా కొనసాగుతోందని, ఈ సేవలను ప్రవాస భారతీయులకు పొడిగించవచ్చని ఈసీ పేర్కొంది. అసోం, పశ్చిమ బెంగాల్‌, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రవాసులకు పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ఈసీ తెలిపింది. 

Updated Date - 2020-12-02T08:56:03+05:30 IST