మాజీ ఎమ్మెల్యే కలమట
కొత్తూరు రూరల్ : నియోజక వర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చకు రావాలని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ సవాల్ విసిరారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సమీకృత వ్యవసాయ ప్ర యోగశాల నిర్మాణం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల అదనపు భవనాల పనులు గత ప్రభుత్వ హయాంలోనే 60శాతం పూర్తయ్యాయని, ఇప్పుడు కొత్తగా వాటికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పాతపట్నం నియోజకవర్గంలో కొత్తగా ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. కాదనంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్, బైరాగినాయుడు, భగవాన్ నాయుడు పాల్గొన్నారు