‘రెడీ టు కుక్‌’... సూపర్‌ హిట్‌

ABN , First Publish Date - 2020-06-13T05:30:00+05:30 IST

లాక్‌డౌన్‌ సమయం జీవనశైలిలోనే కాదు ఆహారపు అలవాట్లలోనూ చాలా మార్పు తీసుకొచ్చింది. ఈ తీరిక వేళ ఇంటిపట్టునే ఉంటూ తక్కువ సమయంలోనే పూర్తయ్యే, నోటికి నచ్చిన ఆహారం తినేందుకు ఎక్కువ ఆసక్తి చూపారు...

‘రెడీ టు కుక్‌’... సూపర్‌ హిట్‌

లాక్‌డౌన్‌ సమయం జీవనశైలిలోనే కాదు ఆహారపు అలవాట్లలోనూ చాలా మార్పు తీసుకొచ్చింది. ఈ తీరిక వేళ ఇంటిపట్టునే ఉంటూ తక్కువ సమయంలోనే పూర్తయ్యే, నోటికి నచ్చిన ఆహారం తినేందుకు ఎక్కువ ఆసక్తి చూపారు. కరోనాకు ముందు రెస్టారెంట్లు, బేకరీలు, చిరుతిండి బండ్ల ముందు క్యూ కట్టిన జనం ఇప్పుడు ఆ రుచులన్నిటినీ ఇంట్లోనే  ఆరగిస్తున్నారు. చిన్నపిల్లలకు ఇష్టమైన స్నాక్స్‌ నుంచి పెద్దలు కూడా ఇష్టంగా లాగించే ఎన్నో వెరైటీ వంటకాలను స్వయంగా వండి మరీ టేస్ట్‌ చేశారు. వాటిలో ‘రెడీ టు కుక్‌’ ఆహారపదార్థాలకు ఎక్కడ లేని గిరాకీ పెరిగింది. రెండు నిమిషాల్లో పూర్తయ్యే మ్యాగీతో మొదలు పానీపూరీ, బిర్యానీ, పిజ్జా.. ఆఖరుకు బర్త్‌డే కేకు వరకూ ప్రతీది శ్రమ అనుకోకుండా వంటగదిలోనే తయారుచేసుకున్నారు.


కబాబ్‌, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, పొటాటో చిప్స్‌... ఇలా తక్కువ సమయంలో పూర్తయ్యే స్నాక్స్‌ వాడకం గతంతో పోల్చితే 70 నుంచి 80 శాతం పెరిగిందని మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ ఇండియా సంస్థ వెల్లడించింది. అలానే తాము తయారుచేసిన ‘రెడీ టూ కుక్‌’ కిచిడీ ఎక్కువగా అమ్ముడయిందని ఫార్చ్యూన్‌ వంట నూనె ఉత్పత్తి చేసే అదానీ విల్‌మార్‌ క ంపెనీ తెలిపింది. మొత్తానికి వంటిట్లో సరుకులే కాదు వంటింటి రుచులూ మరిపోయాయన్నమాట.


Updated Date - 2020-06-13T05:30:00+05:30 IST